Nagarkurnool News: తెలంగాణలో తీవ్ర విషాదం - గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి
Strange Death: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గొంతులో గుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి శ్వాస అందక ప్రాణాలు కోల్పోయాడు.
Man Dies Egg Stucked In His Throat In Nagarkurnool: మృత్యువు.. ఎప్పుడు ఎవరిని ఎలా బలి తీసుకుంటుందో ఊహించలేం. అప్పటివరకూ మనతో ఉన్న వారే ఎవరూ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోతుంటారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడం, గొంతులో దోశ, మటన్, చికెన్ ముక్కలు ఇరుక్కుని పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల మనం చూస్తున్నాం. తాజాగా, అలాంటి విషాద ఘటనే నాగర్ కర్నూల్ జిల్లాలో (NagarKurnool District) చోటు చేసుకుంది. గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. చెన్నంపల్లి చౌరస్తా వద్ద ఓ బజ్జీల బండి వద్ద తిరుపతయ్య (50) అనే వ్యక్తి ఎగ్‌బజ్జీలు తింటుండగా గొంతులో ఇరుక్కుంది. ఈ క్రమంలో శ్వాస అందక అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టూ ఉన్న వారు కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. మృతుడు.. బిజెనపల్లి మండలం నందివడ్డెమాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Also Read: Hyderabad News: బయటి ఫుడ్ తింటున్నారా? - చికెన్‌లో పురుగు, దోశలో బొద్దింక - ఇవి చూస్తే నిజంగా షాక్