Viral News: ప్రెగ్నెంట్ చేస్తే చాలు రూ.పది లక్షలట - నమ్మేవాడుంటే నట్టేట ముంచుతారు - ఈ కొత్త స్కామ్ గురించి విన్నారా ?
Make Childless Women Pregnant : ప్రపంచంలో చాలా రకాల మోసాలు జరుగుతాయి. అందులో ఇది ఒకటి. పిల్లలు పుట్టని మహిళలకు ప్రెగ్నెన్సీ వచ్చేలా చేస్తే పది లక్షలు ఇస్తామని ఆశపెట్టారు. ఉన్నదంతా ఊడ్చేశారు.

Make Childless Women Pregnant Get Rs 10 Lakh Bihar Cops Bust Unique Scam: మోసపోయేవాడు ఉంటే పిట్టకథలు ఎన్ని అయినా చెప్పి నట్టేట ముంచేస్తారు మోసగాళ్లు. ఆన్ లైన్ విస్తృతి పెరిగిన తరవాత ఈ మోసాలు మరింత ఎక్కువయ్యాయి. చివరికి అమ్మాయిల్ని ప్రెగ్నెంట్ చేయండి డబ్బులు తీసుకోండి అని చెప్పినా నమ్మేసవాళ్లు ఉంటారని ఈ బీహార్ ముఠా పట్టుబడేవరకూ చాలా మంది నమ్మరేమో.
దేశంలో పిల్లలు పుట్టని మహిళలు చాలా మంది ఉన్నారని వారికి ప్రెగ్నెన్సీ చేసి పెడితే చాలన్నారు. ఇందు కోసం వారితో శృంగారంలో పాల్గొనాలని చెబుతున్నారు. ఒక వేళ ప్రయత్నాలు చేసినా ఫలించకపోతే యాభై వేల నుంచి ఐదు లక్షల వరకూ ఇస్తామని ఫేస్ బుక్ ప్రకటనలు ఇచ్చారు. దీనికి చాలా మంది ఆకర్షితులయ్యారు.
డబ్బులు ఇస్తామంటున్నారు కదా మరి మోసం అని ఎలా అంటున్నామంటే.. ఇక్కడే అతి పెద్ద స్కామ్ ఉంది. ఇతర ఉద్యోగ ప్రకటనల్లాగే ఇది కూడా. ఆ ఉద్యోగ ప్రకటనల్లో మోసాలు చేస్తూంటారు. రిజిస్ట్రేషన్ ఫీజు అని అదని.. ఇదనీ వసూలు చేస్తూంటారు. ఇక్కడ కూడా అంతే. రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు హోటల్ ఖర్చులు అని చెప్పి.. పాతిక నుంచి యాభై వేల వరకూ వసూలు చేస్తున్నారు. డబ్బులు పోతే పోయాయ.. ఓ మహిళతో పడక సుఖం వస్తుందని.. పైగా పది లక్షలు వస్తాయని ఆశ పడుతున్నారు. తీరా డబ్బులు తీసుకుని స్పందించకుండా మానేస్తున్నారు.
साइबर अपराध के कांड में संलिप्त 03 अभियुक्त को नवादा पुलिस ने किया गिरफ्तार।
— Nawada Police (@nawadapolice) January 6, 2025
"All India pregnant job" और "playboy service" के नाम पर लोगों से करते थे ठगी।
साइबर थाना द्वारा की गई कार्रवाई@bihar_police @DMNawada @IgMagadh #nawadapolice#Nawada#नवादा pic.twitter.com/fOBnaOU3Zu
బీహార్ లో దొరికిన ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు బయట పెట్టిన వివరాలు చూసి దేశం మొత్తం షాక్ అయింది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబూ అని అందరూ అనుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి నేరాల్లోనే సరికొత్త నేరాన్ని ఈ మఠా చేసి పెట్టింది.
ఎవరైనా ఇలాంటి వాటికి డడబ్బులు ఇస్తామని చెబితే మోసపోవద్దని పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరాలు ఇలాంటి విచిత్రమై న ఆఫర్లకు ఆకర్షితం అయినప్పుడే జరుగుతున్నాయని అందుకే అందుకే అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అయితే కొత్త కొత్త ఐడియాతో నేరగాళ్లు వస్తున్నారు. ఎప్పటికప్పుడు నేరాలు పెరిగిపోతూన ఉన్నాయి.
Also Read: పెళ్లి చేసుకుని బిడ్డను కని భార్యను వదిలేశాడు - 2 రోజులుగా భర్త ఇంటి ముందే బాధితురాలి మౌన పోరాటం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

