By: Ram Manohar | Updated at : 12 May 2023 02:22 PM (IST)
మధ్యప్రదేశ్‌లోని ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి రూ.7 కోట్ల విలువైన ఆస్తులుండటం సంచలనమవుతోంది. (Image Credits: NCMIndiaa/Twitter)
MP Officer Hema Meena:
మహిళా ఇంజనీర్ ఇంట్లో తనిఖీలు
నెల జీతం రూ.30 వేలు. కానీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? రూ.7 కోట్లు. అట్లుంటది మరి సర్కార్ కొలువంటే. ప్రభుత్వ ఉద్యోగులందరూ అలానే ఉంటారని కాదు. కొందరు మాత్రం ఇలా ఓ రేంజ్‌లో ఆస్తులు వెనకేసుకుంటారు. మధ్యప్రదేశ్‌లో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్‌లో (Madhya Pradesh Police Housing Corporation) ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి ఆస్తుల చిట్టా చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. యాంటీ కరప్షన్ రెయిడ్స్‌లో భాగంగా హేమ మీనా ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు. లెక్క పెడుతున్న కొద్ది ఆ చిట్టా పెరుగుతూనే ఉంది. మొత్తం 20 వాహనాలున్నాయి. వాటిలో 5-7 లగ్జరీ కార్లే. 20 వేల చదరపు అడుగులు స్థలం కూడా ఉంది. గిర్ జాతికి చెందిన ఆవులు 24 ఉన్నాయంటే...వాటి విలువ ఎంతో అంచనా వేసుకోవచ్చు. 98 ఇంచుల హైఎండ్ టీవీ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. అది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ప్రైస్ ట్యాగ్ చూసి అధికారులు షాక్ అయ్యారు. రూ.30 లక్షల విలువ చేసే టీవీ అది. రూ.30 వేల నెల జీతం ఉన్న ఉద్యోగికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయనేది షాకింగ్‌గా ఉంది. వీటిలో కొన్ని ఆస్తులు ఆమె పేరిట ఉండగా..మరి కొన్ని కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయి. అందులోనూ ఆమె ఉద్యోగంలో చేరి పదేళ్లు మాత్రమే అవుతోంది. పదేళ్లలోనే ఇంత ఎలా సంపాదించింది అనేదే అంతు చిక్కని ప్రశ్న. విలువైన ఆస్తులతో పాటు 100 కుక్కలు, వైర్‌లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ జామర్స్‌తో పాటు మరికొన్ని విలువైన వస్తువులనూ స్వాధీనం చేసుకున్నారు.
తండ్రి పేరిట స్థలం
లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (SPE) అధికారులు సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేయాలంటూ లోపలకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అప్పుడే ఈ ఆస్తులన్నీ బయటపడ్డాయి. కేవలం ఒక్కరోజులోనే రూ.7 కోట్లు ఆస్తుల్ని జప్తు చేశారు. ఆమె ఇన్‌కమ్‌తో పోల్చుకుంటే ఈ ఆస్తుల విలువ 232% కన్నా ఎక్కువే. తన తండ్రి పేరు మీద 20 వేల చదరపు అడుగులు స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ తరవాత కోటి రూపాయల విలువ చేసే ఇల్లు కట్టారు. రైజెన్, విదిష జిల్లాల్లోనూ కొన్ని స్థలాలు ఆమె పేరిట ఉన్నట్టు గుర్తించారు. మరో ట్విస్ట్ ఏంటంటే...పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ కోసం వాడాల్సిన మెటీరియల్‌ని తన ఇల్లు కట్టుకోడానికి వాడారు. వీటితో పాటు భారీ వ్యవసాయ మెషీన్లనూ స్వాధీనం చేసుకున్నారు. భోపాల్ లోకాయుక్త ఎస్‌పీ కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం మూడు చోట్ల సెర్చ్ ఆపరేషన్‌లు జరిగాయని తెలిపారు. రూ.5-7 కోట్ల విలువైన ఆస్తుల్ని ఇప్పటి వరకూ గుర్తించినట్టు స్పష్టం చేశారు. మిగతా డిపార్ట్‌మెంట్‌ల సహకారం కూడా తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.
Also Read: Karnataka Election 2023: సౌతాఫ్రికా EVMలనే కర్ణాటకలో వాడారంటూ కాంగ్రెస్ ఆరోపణలు, కొట్టి పారేసిన ఈసీ
Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !
Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం
Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!
Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ
Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం
Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!
Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం
Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ