Machilipatnam Rape: సరదాగా బీచ్‌కి వెళ్లిన లవర్స్, ఇంతలో ఊహించని ఘటన - ప్రియుడ్ని చెట్టుకు కట్టేసి అతని ముందే యువతిపై రేప్!
Bandar Mandal: కృష్ణా జిల్లా బందరు మండలం పల్లిపాలెం బీచ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు వివరాలను వెల్లడించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. యువతిపై కొందరు కామాంధులు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆమె తన ప్రేమికుడితో ఉండగానే దుండగులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. అతణ్ని తాడుతో కట్టేసి అతని ముందే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఫిషింగ్ హార్బర్ చూద్దామని సముద్ర తీర ప్రాంతానికి ప్రేమ జంట వెళ్లగా.. చివరికి ఇలా విషాదాంతం అయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు.. బందర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా బందరు మండలం పల్లిపాలెం బీచ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు వివరాలను వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిషింగ్ హార్బర్ చూసేందుకు వెళ్లిన ప్రేమజంటపై అత్యాచారయత్నం దుండగులు చేశారు. ప్రియుడిని తాళ్లతో చెట్టుకు కట్టేసి, యువతిపై కొందరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, బందర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లైంగిక దాడికి పాల్పడ్డవారిలో నాగబాబు అనే వ్యక్తి కూడా ఉన్నారని పోలీసులు గుర్తించి, అతనిపై కేసు నమోదు చేశారు.
బాధితురాలిని ఓ విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. ఈమె తన ప్రియుడితో కలిసి బీచ్‌కి వెళ్లింది. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా, వారి వద్దకు వెళ్లిన ఇద్దరు మందుబాబులు వెళ్లారు. ఫూటుగా తాగిన వారు ప్రియుడిని తాళ్లతో చెట్టుకు కట్టేశారు. విద్యార్థినిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఎవరికీ చెప్పుకోలేక ప్రేమ జంట గమ్మున ఉండిపోయింది. అయితే, ఈ ఘటనపై తీవ్రంగా బాధ పడిపోతున్న విద్యార్థినిని ఆమె సోదరుడు గమనించి గట్టిగా అడిగాడు. దీంతో విద్యార్థిని విషయాన్ని తన సోదరుడికి చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బందరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాగబాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు బందరు ఎస్సై వాసు తెలిపారు.
Also Read: Weather Updates: వెదర్ అప్‌డేట్! ఈ తేదీ నుంచి మరింత మండిపోనున్న ఎండలు, ఈ ప్రాంతాల్లో అధిక ప్రభావం
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! నేడు భారీగా దిగొచ్చిన బంగారం, వెండి కూడా దిగువకు - నేటి ధరలు ఇవీ
Also Read: PM Modi Live: రాసిపెట్టుకోండి మళ్లీ మళ్లీ ఇదే సీన్ రిపీట్ అవుద్ది: ప్రధాని మోదీ పవర్‌పుల్ డైలాగ్స్