News
News
X

హైదరాబాద్‌లో లక్కీ డ్రా పేరుతో మోసం- ఓ వ్యక్తి అరెస్ట్!

Lucky Draw Fraud: లక్కీడ్రా పేరుతో అమాయక ప్రజలకు కుచ్చు టోపీ పెడ్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్కీ డ్రా నిర్వహిస్తుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

FOLLOW US: 
 

Lucky Draw Fraud: హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్కీ డ్రా పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శ్రీరామ్ నగర్ లక్కీ ఫంక్షన్ హాల్లో లక్కీ డ్రా తీస్తుండగా... వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడకు వెళ్లారు. అనుమతులు లేకుండా లక్కీ డ్రా నిర్వహిస్తున్న మమ్మద్ షాకిర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి సుమారుగా 800 కాయిన్లు... దానికి సంబంధించిన వివిధ సాధనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతీ నెల పదో తేదీన డ్రా ఉంటుంది అని చెప్పి ప్రజలందరిని పిలిపించి.. ఒక్కొక్క పేరుతో కాయిన్లు తీస్తారు. కొన్ని నెలల పాటు సాఫీగానే సాగించి ఆ తర్వాత మూటాముల్లె సర్దుకొని వెళ్లిపోతారు. 


తాజాగా నిజామాబాద్ లో ఇలాంటి ఘటనే..

నిజామాబాద్ జిల్లాలో అనీయా గ్రీన్ ఎంటర్ ప్రైజెస్ లక్కీ డ్రా పేరుతో వేల మందికి కుచ్చుటోపీ పెట్టింది. లక్కీ డ్రా స్కీమ్ ప్రారంభించిన సంస్థ వేల మందిని సభ్యులుగా చేర్చుకుంది. ఏజెంట్ల సాయంతో నెలకు రూ.1000 చొప్పున వసూలు చేసింది. నెలవారీ లక్కీ డ్రాలో కార్లు, బైకులు, ఫ్రిజ్‌లు ఇస్తామని నమ్మబలికింది. ఈ వ్యవహారం కొద్దినెలలు సాఫీగానే సాగిపోయింది. ఆ తర్వాత లక్కీ డ్రా నిలిచిపోయింది. అయినా నెలవారీ డబ్బులు వసూలు చేశారు ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు. సుమారు 16 నెలలు గడిచిపోయాయి. తీరా తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వమని స్కీమ్‌లో సభ్యులు అడగడంతో సంస్థ నిర్వాహకులు ఫోన్లు తీయడం మానేశారు. కొద్దిరోజులకి ఆ ఫోన్లు పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సుమారు 3 వేల మంది నుంచి 9 కోట్ల 60 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.

News Reels

రూ.40 కోట్లకు పైగా వసూలు 

రెండు స్కీముల్లో  6 వేల మంది సభ్యులుగా ఉన్నారని బాధితులు అంటున్నారు. అనీయా ఎంటర్ప్రైజెస్ పేరుతో రెండు సార్లు లక్కీ డ్రా నిర్వహించగా, మొత్తం సుమారు రూ.40 కోట్లతో నిర్వాహకులు బోర్డు తిప్పేశారని బాధితులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం  ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ వద్ద బాధితులు బోరుమన్నారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు ఆరువేలకు మంది  పైగా మోసపోయారు. 150 మంది బాధితులు కలెక్టరేట్‌కి వచ్చి ఫిర్యాదు చేశారు. నిందితులు విదేశాలకు పారిపపోయే అవకాశం ఉందని, వారి పాస్‌పోర్టులు సీజ్ చేసి వెంటనే వారిని అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. సివిల్ మ్యాటర్ అంటూ పోలీసులు పట్టించుకోవట్లేదని, నమ్మించి మోసం చేసిన నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని బాధితులు కోరుతున్నారు. 

హైదరాబాద్ కు మకాం..

నిజామాబాద్ కు చెందిన ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఈ ఎంటర్ప్రైజెస్ నడిపించారు. సదరు వ్యక్తిని బాధితులు నిలదీయడంతో హైదరాబాద్ కు మకాం మార్చాడు. దీంతో డ్రా కోసం డబ్బులు కట్టిన వారు అయోమయంలో పడ్డారు. అయితే డ్రాలో దక్కిన వస్తువులు సైతం నాసిరకంగా ఉన్నాయని డ్రాలో వస్తువులు గెలుచుకున్న కొందరు సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని, ఇలాంటి లక్కీ డ్రా స్కిమ్ మోసాలపై ఉక్కుపాతం మోపాలని, బాధితులు వేడుకుంటున్నారు. అలాగే మోసపోయిన వారికి డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు.

Published at : 10 Oct 2022 06:31 PM (IST) Tags: Hyderabad crime news Hyderabad News Lucky Draw Fraud Man Arrest in Hyderabad Telaagana Crime News

సంబంధిత కథనాలు

Bapatla Crime : కట్టుకున్న వాడే కాలయముడు, భార్యపై కత్తితో దాడి చేసి హత్య!

Bapatla Crime : కట్టుకున్న వాడే కాలయముడు, భార్యపై కత్తితో దాడి చేసి హత్య!

గుంటూరులో బంగారం దొంగలు అరెస్ట్, కేజీ బంగారం స్వాధీనం

గుంటూరులో బంగారం దొంగలు అరెస్ట్, కేజీ బంగారం స్వాధీనం

Vijayawada News: సాల్ట్ పథకం పేరిట నిరుద్యోగులకు కుచ్చు టోపీ, కోట్లలో మోసం!

Vijayawada News: సాల్ట్ పథకం పేరిట నిరుద్యోగులకు కుచ్చు టోపీ, కోట్లలో మోసం!

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Mahabubnagar Crime : చిన్నారిపై బాబాయ్ లే అత్యాచారం, ఆపై హత్య!

Mahabubnagar Crime : చిన్నారిపై బాబాయ్ లే అత్యాచారం, ఆపై హత్య!

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.