అన్వేషించండి

2025 Maruti Dzire 8,500km రివ్యూ - సిటీ ట్రాఫిక్‌లో, బ్యాడ్ రోడ్స్‌లో ఈ కారు పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉంది?

2025 మారుతి డిజైర్ 8,500km లాంగ్ టర్మ్ రివ్యూలో సిటీ రోడ్లపై ఎలా పెర్ఫార్మ్‌ చేసింది?, మైలేజ్‌, కంఫర్ట్‌, AC పనితీరు, ఇంజిన్‌ రెస్పాన్స్‌, బ్యాడ్ రోడ్స్‌లో డ్రైవ్‌ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోండి.

Maruti Dzire Long Term Review 2025: మారుతి డిజైర్ గురించి ఈ స్టోరీని పూర్తిగా చదివితే, ఈ సెడాన్‌ ఎందుకు సంవత్సరాలుగా బెస్ట్‌ సెల్లర్‌గా నిలుస్తోందో మరోసారి స్పష్టమవుతుంది. లాంగ్ టర్మ్ టెస్ట్‌లో 8,500 కిలోమీటర్లు పూర్తయిన తర్వాత, డిజైర్‌ రోజువారీ సిటీ డ్రైవింగ్‌లో ఎలాంటి అనుభవం ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాల్లోనూ డ్రైవింగ్ అనుభవం సూపర్‌
హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోని రోడ్ల పరిస్థితులు ఏంటో అందరికీ తెలుసు. ఒక్కసారి భారీ వర్షాలు పడితే రోడ్లు గుంతలతో నిండిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా డిజైర్‌ ఇచ్చిన డ్రైవింగ్ అనుభవం చాలా సూపర్‌. గ్రౌండ్ క్లియరెన్స్, రైడ్ క్వాలిటీ - ఈ రెండూ రోజువారీ డ్రైవ్‌ను చాలా ఈజీగా మార్చేస్తాయి. స్పీడ్ బంప్స్‌, ప్యాచ్ చేసిన రోడ్లు, నీళ్లతో నిండిన లేన్లు... ఏదైనా సరే, కారులో ఉండే వాళ్లకు పెద్దగా షాక్‌ అనిపించదు. నలుగురితో ఫుల్ లోడ్ ఉన్నప్పటికీ ఈ కారు బ్యాలెన్స్‌ కోల్పోవడం దాదాపు జరగదు.

అద్భుతమైన మైలేజ్‌
డిజైర్‌లో ఉన్న Z12E ఇంజిన్‌ మరో ముఖ్యమైన ఆకర్షణ. ఇది, గత 4-సిలిండర్‌ K15C లాంటి పవర్‌ను ఇవ్వకపోయినా, మైలేజ్‌ విషయంలో మాత్రం టాప్ క్లాస్‌. ఎంత హేవీ ట్రాఫిక్‌ ఉన్నా 14 నుంచి 14.8 kmpl కన్నా తక్కువ చూపించడం అరుదు. హైదరాబాద్‌ లేదా విజయవాడ వంటి సిటీ ట్రాఫిక్‌ పరిస్థితుల్లో ఇంత మైలేజ్‌ రావడం నిజంగా ప్రశంసనీయం. నెల మొదట ఫుల్‌ ట్యాంక్‌ చేశాక దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించే వరకు మళ్లీ ఫ్యూయల్ స్టేషన్‌కు వెళ్లాల్సిన పని లేకపోయింది.

టాప్‌ క్లాస్‌ AC 
మన తెలుగువాళ్లకు AC పనితీరు చాలా ముఖ్యం. సాధారణంగా, మారుతి కార్లలో AC పవర్‌ఫుల్‌గా & క్విక్‌గా ఉంటుందని అందరికీ తెలుసు. డిజైర్‌ కూడా అదే రీతిలో పనితీరు చూపిస్తుంది. సిటీలో స్లో ట్రాఫిక్‌ డ్రైవ్ చేస్తున్నా, హైవేపై వేగంగా నడిపినా AC పనితీరు ఎప్పుడూ సేమ్‌గా కనిపించింది.

సిటీ కమ్యూట్‌లో డ్రైవర్‌కు లైట్ స్టీరింగ్‌ & సాఫ్ట్ క్లచ్‌ చాలా వరకూ రిలాక్స్‌డ్‌ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తాయి. 360-డిగ్రీ కెమెరా కూడా పార్కింగ్‌ సమయంలో చాలా హెల్ప్‌ చేస్తుంది, ప్రత్యేకంగా హైదరాబాద్‌ పాతబస్తీ లాంటి టైట్ లేన్లలో.

కొన్ని చిన్న ఇబ్బందులు 
అయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. ఉదాహరణకు, బ్రైట్ ఇంటీరియర్‌ అప్‌హోల్స్టరీ. వర్షాకాలంలో కారులోకి ఎక్కేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే సీట్లు త్వరగా మరకలు పడతాయి. అలాగే ముందు భాగంలో టైప్‌-C USB పోర్టులు లేకపోవడం కొంత అసౌకర్యం కలిగిస్తుంది. కొత్త ఫోన్లు ఎక్కువగా Type-C వాడుతున్నాయి కాబట్టి అదనంగా USB-A కేబుల్‌ వెంట తీసుకెళ్లాల్సి వస్తుంది.

మరొక ఇబ్బందికర విషయం.. మారుతి ఆటో స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌. ఇది చాలా సెన్సిటివ్‌గా పని చేస్తుంది. ట్రాఫిక్‌లో చిన్నగా బ్రేక్ వేసినా ఇంజిన్ ఆఫ్‌ అయిపోతుంది. వేగం పెంచాల్సిన టైంలో కారు అకస్మాత్తుగా ఆగిపోతే బాగా ఇబ్బంది. అందుకే డిజైర్‌ డ్రైవ్‌ చేసే వాళ్లు మొదట చేసే పని - ఆటో స్టార్ట్/స్టాప్‌ను ఆఫ్‌ చేయడం.

ఈ చిన్న ఇబ్బందులు తప్పిస్తే, డిజైర్‌కు పెద్ద లోపం అంటూ ఏమీ లేదు. ఇది నిజంగా రోజువారీ సిటీ డ్రైవ్‌కు సూటయ్యే కారు. కంఫర్ట్‌ సూపర్‌, మైలేజ్‌ టాప్‌, AC బెస్ట్‌, డ్రైవ్ అనుభవం స్మూత్‌. అందుకే, ఈ మాన్యువల్‌ కారుకు ఇంకా పెద్ద డిమాండ్‌ ఉంది.

సిటీ హడావిడి నుంచి బయటకు వెళ్లి, ఇదే ప్రదర్శన హైవేపై ఎలా ఉంటుందో పరీక్షించే సమయం వచ్చింది, ఆ వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తాం. కానీ, ఇప్పటివరకు డిజైర్‌ ఇచ్చిన ఫలితాలు మాత్రం నిజంగా ఇంప్రెస్‌ చేస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget