Viaterra Austin Riding Jeans: స్టైలిష్ & సేఫ్ - వియటెర్రా ఆస్టిన్ రైడింగ్ జీన్స్ యూత్‌కు ఎలా అనిపిస్తుంది?
రోజువారీ సిటీ రైడింగ్ కోసం స్టైల్‌గా, కంఫర్ట్‌గా ఉండే Viaterra Austin రైడింగ్ జీన్స్ ఎలా పనిచేస్తాయో, వాటి ప్రోస్ & కాన్స్ ఈ రివ్యూలో క్లియర్‌గా చెబుతున్నాం.

Viaterra Austin Riding Jeans Review: రైడింగ్ చేసే యూత్ ఇప్పుడు కామన్‌గా ఆలోచిస్తున్న విషయం... “స్టైల్ మిస్ కాకుండా, సేఫ్టీని కూడా ఎలా అందుకోవాలి?”. అదే సమయంలో, ఆఫీస్‌కి వెళ్లే సమయంలో సేఫ్టీ గేర్స్ అన్నీ తలిగించుకుని విభిన్నంగా కూడా కనిపించకూడదు. ఈ ఆలోచనలకు అనుగుణంగా, స్టైల్ + సేఫ్టీ మిక్స్ కోసం మార్కెట్‌లో రైడింగ్ జీన్స్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ లైనప్‌లో ఎక్కువగా మాట్లాడుకునే ఆప్షన్ Viaterra Austin రైడింగ్ జీన్స్. 2025 కోసం ఇవి ఎలా మారాయి?, నిజంగా ఈ జీన్స్ డబ్బుకు విలువైనవేనా? ఇపుడు క్లియర్‌గా తెలుసుకుందాం.
సాధారణ జీన్స్ లాంటి లుక్స్
మొదటగా, Viaterra Austin డిజైన్ చూస్తే, ఇవి రెగ్యులర్ జీన్స్‌లా కనిపిస్తాయి. అంటే ఆఫీస్, కాలేజ్, సిటీ రైడ్, దూర ప్రయాణాలు - చోటైనా మీరు “రైడింగ్ గేర్ వేసుకున్నట్టు” ఎవరూ గ్రహించరు. ఈసారి కంపెనీ ఈ ఫిట్‌ను Levi’s 501 స్టైల్‌ను అనుసరించి మార్చింది. అందుకే ఇవి యూత్‌కి చాలా నేచురల్‌గా, క్యాజువల్‌గా అనిపిస్తాయి. అలాగే మీ బైక్ బూట్స్‌పై కూడా ఇవి బాగా కూర్చుంటాయి. స్పోర్ట్స్ రైడింగ్ బూట్స్‌తో సరిపొయినట్లుగా సెటిలైపోతాయి. అయితే, పెద్ద ఆఫ్-రోడ్ బూట్స్‌పై మాత్రం అవి పూర్తిగా కవర్ కావు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్.
సేఫ్టీ
సేఫ్టీ విషయానికి వస్తే, Viaterra Austin లో ఉన్న SasTec CE Level 2 ఆర్మర్ చాలా పొట్టిగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అందుకే మోకాలు, హిప్ భాగాల్లో ముందుకు పొడుచుకువచ్చినట్లు పెద్దగా కనిపించదు. బయటివాళ్లు చూస్తే ఇవి ఆర్మర్ జీన్స్ అని అస్సలు అనుకోరు. ప్యాంట్‌లోని 5-pocket డిజైన్, డీప్ పాకెట్స్... ఫోన్, తాళాలు, వాలెట్ పెట్టుకోవడానికి బాగానే వర్క్ అవుతాయి. రోజంతా డెస్క్ వద్ద కూర్చున్నా, ఎక్కువ దూరం నడిచినా ఇవి సరైన కంఫర్ట్ ఇస్తాయి.
కొన్ని మైనస్‌లు
ఇలా చాలా ప్లస్ పాయింట్లు ఉన్నా, కొన్ని ఆలోచించాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. మొదటగా, పొడవైన రైడర్లకు నీ ఆర్మర్ (knee armour) పొజిషనింగ్ అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న రైడర్‌కి ఆర్మర్ కొంచెం పైకే ఉంటుంది. Viaterra రెండు armour pockets ఇచ్చినా, లోయస్ట్ పొజిషన్‌లో కవరేజ్ కొంచెం తగ్గుతుంది. పొడవైన లేదా లావుగా ఉన్న రైడర్లు కొనుగోలు చేసే ముందు ట్రై చేసి చూడటం మంచిది.
రెండోది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ జీన్స్‌లో రాపిడి నిరోధక లైనర్ (abrasion-resistant liner) లేదు. అంటే, కాటన్ + పాలిస్టర్ + స్పాండెక్స్ మిక్స్‌తో ఇవి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి, కానీ రోడ్‌పై పడిపోయినప్పుడు & జారినప్పుడు పెద్దగా ప్రొటెక్షన్ ఇవ్వవు. రైడింగ్ జీన్స్‌కి ఇది పెద్ద మైనస్. లైనర్ పెడితే ప్యాంట్ బరువు, హీట్, ధర పెరుగుతాయి. అయితే, సేఫ్టీ మాత్రం బలపడుతుంది.
అందుకే, Viaterra Austin Riding Jeans ను సిటీ రైడింగ్‌కి మాత్రం రెకమెండ్ చేయవచ్చు. ఆఫీస్‌కి వెళ్లే యువత, క్యాజువల్ బైక్ రైడ్ చేసే వాళ్లు, పెద్దగా అడ్వెంచర్ రైడ్లు చేయనివాళ్లకు ఇవి పర్ఫెక్ట్. రెగ్యులర్ జీన్స్ కంటే చాలా సేఫర్. కానీ టూరింగ్ లేదా హై-స్పీడ్ రైడర్లకు మాత్రం ఇవి సరైన ఆప్షన్ కావు.
ధర
ధర విషయానికి వస్తే... Viaterra Austin రైడింగ్ జీన్ ధర ₹5,999. ఈ ప్రైస్ రేంజ్‌లో స్టైల్, కంఫర్ట్, బేసిక్ ప్రొటెక్షన్ అన్నీ కలిగిన రైడింగ్ జీన్స్‌గా ఇవి మంచి డీల్. Viaterra భవిష్యత్తులో abrasion linerతో ఒక హై-టెక్ వెర్షన్ విడుదల చేస్తే మరింత బెటర్ అవుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















