Ankita Singh Last words: ప్రేమించలేదని పెట్రోల్ పోసి నిప్పు, యువతి మృతి - ఆమె చివరి మాటలు విన్నారా !
తనను ప్రేమించలేదన్న కారణంగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించగా.. తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయింది.
జార్ఖండ్‌లో ప్రేమోన్మాది పిచ్చి చర్యకు అంకితా సింగ్ అనే యువతి బలైపోయింది. తనను ప్రేమించలేదన్న కారణంగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించగా.. తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయింది. కానీ ఎంతో మానసిక క్షోభ అనువించి చనిపోయిన అంకితా సింగ్ చివరి మాటలు ఏంటో తెలుసా. నన్ను ఇంత దారుణంగా హింసించిన వాడిని మరింత దారుణంగా శిక్షించండి. అతడు నాకెంతో ఇంకా ఎక్కువ వేదన అనుభవించాలని ఆమె మాట్లాడిన చివరి మాటలు వైరల్ అవుతున్నాయి. కానీ సీన్ కట్ చేస్తే.. ఆ ప్రేమోన్మాది పోలీసు కస్టడీలో నవ్వుతూ కనిపించడం ఆ కుటుంబాన్ని మరింత నరకంలోకి నెట్టేస్తోంది.
అసలేం జరిగిందంటే..
జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో అంకితా సింగ్ అనే 19 ఏళ్ల యువతి తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆమెకు షారుక్ హుస్సేన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొన్ని రోజుల్లోనే ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం మొదలుపెట్టాడు. రోజూ ఆమెకు ఫోన్ చేసి తనను ప్రేమించాలని వేధించసాగాడు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, అతడి లవ్ ప్రపోజల్ ను అంకిత అంగీకరించలేదు. పైగా తనను మందలించడంతో అంకితపై షారుక్ పగ పెంచుకున్నాడు. ఆమెను హత్య చేయాలని భావించి అందుకు ప్లాన్ చేసుకున్నాడు నిందితుడు.
ప్రేమించలేదని పగ, హత్యకు ప్లాన్ చేసిన షారుక్..
ఆగస్టు 22న తెల్లవారుజామున అంకిత ఇంటికి షారుక్ వెళ్లాడు. ఆ సమయంలో అంకిత కిటికీ దగ్గర మంచం మీద పడుకోవడం గమనించాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ఆమె మీద పోసి, వెంటనే అగ్గిపుల్ల వెలిగించి ఆమెకు నిప్పంటిచాడు. దీంతో ఆమెకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు, కుటుంబసభ్యులు అంకితను రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అయితే షారుక్ వారి ఇంటికి వచ్చిన సమయంలో ఇంట్లో అంకిత ఒంటరిగా ఉంది. తండ్రి సంజీవ్, తల్లికి ముగ్గురు పిల్లలలో అంకిత రెండో సంతానం.
जैसे हम मर रहें हैं वैसे ही शाहरुख़ को भी तड़प कर मरना चाहिए: झारखंड की अंकिता के आख़िरी शब्द pic.twitter.com/nAo0ZX3eNi
— Shubhankar Mishra (@shubhankrmishra) August 29, 2022
రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అంకిత ఆదివారం తెల్లవారుజామున మరణించింది. అయితే షారుక్ తనకు నిప్పంటించి హత్య చేసే ప్రయత్నం చేసిన తరువాత ఆసుపత్రిలో ఆమె మీడియా మాట్లాడింది. ప్రేమించకపోతే చంపేస్తానని షారుక్ వేధించినట్లు చెప్పింది. తాను కళ్లు తెరిచి చూసేసరికి మంటల్లో కాలిపోతున్నానని, షారుక్ పారిపోతున్నట్లు కనిపించాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. షారుక్ సైతం తనకంటే ఎక్కువ బాధ, నరకం అనుభవించాలని అంకిత కోరింది. చికిత్స పొందుతూ ఆమె చనిపోవడంతో.. షారుక్‌కు దారుణమైన శిక్ష పడాలి, తనకన్నా ఎన్నోరెట్లు వేదన అనుభవించాలి అనేది ఆమె చివరి కోరిక అయింది.
దుర్మార్గుడు అనుకున్నంత దారుణం చేశాడు
నా కుమార్తె నెంబర్ సేకరించి ఆమె తరచుగా ఫోన్ చేసేవాడు షారుక్. తనను ప్రేమించాలని కోరేవాడు. కానీ ఇలాంటివి తనకు నచ్చవు అని ఆమె వారించడంతో పగ పెంచుకున్నాడు. చంపేస్తానని ఫోన్ కాల్ ద్వారా బెదరించేవాడని అంకిత తండ్రి సంజీవ్ తెలిపారు. ఆ దుర్మార్గుడు తనకు దక్కదనే కోపంతో కూతుర్ని హత్య చేశాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
అంకిత చనిపోవడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా దుమ్కాలో 144వ సెక్షన్ విధించారు. బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన తెలిపారు. నిందితుడు షారుక్‌ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కానీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లే సమయంలో నిందితుడు షారుక్ నవ్వుతూ వెళుతున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.