Kurnool News : టోల్ గేట్ సిబ్బందిపై పత్తికొండ ఎమ్మెల్యే అనుచరుల దాడి!
Kurnool News : పత్తికొండ ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. తమ వాహనాన్ని అనుమతించలేదని టోల్ గేట్ సిబ్బందిపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Kurnool News : కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే అనుచరులు టోల్ గేట్ వద్ద బీభత్సం సృష్టించారు. పత్తికొండ ఎమ్మెల్యే కారు వస్తుందన్న విషయం తెలుసుకున్న టోల్ సిబ్బంది గెట్ ను తెరిచి ఉంచారు. ఆ తర్వాత గేటు వెంటనే ఆటోమేటిక్ గా ముసుకుపోయింది. ఎమ్మెల్యే కారు వెనకాలే వస్తున్న అనుచరులు మేము ఎమ్మెల్యేకు చెందిన మనుషులు అని, గేటు ముస్తారా అంటూ సిబ్బందిపై దాడికి దిగారు. కారులో ఉన్న కర్రలు తీసుకొని సిబ్బందిపై దాడి చేశారు. కర్నూలు జిల్లా అమకతాడు టోల్ ప్లాజా వద్ద వైసీపీ నాయకులు కట్టెలతో దాడికి దిగడం కలకలం రేపుతోంది. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ట్రావెల్ సిబ్బందిపై రౌడీ షీటర్ దాడి
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. శుక్రవారం రాత్రి ట్రావెల్స్ ఆఫీస్ పై అనుచరులతో కలిసి దాడి చేశాడు. ఆలస్యంగా వెళ్లి బస్ ని వెనక్కి రప్పించాలంటూ హుకూం జారీ చేశాడు రౌడీ షీటర్. ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడతారని కావాలంటే తర్వాత బస్ లో ఎక్కిస్తామని ట్రావెల్ సిబ్బంది చెప్పినా పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డారు. నేనెవరో తెలుసా అంటూ అనుచరులతో కలిసి ట్రావెల్ సిబ్బందిపై దాడి చేశారు. అయితే ఈ దాడిలో మరో ట్విస్ట్ ఏంటంటే ఏలూరు అధికార పార్టీ మహిళా కార్పొరేటర్ భీమవరపు హేమ సుందరి దగ్గరే ఉండి తన భర్త దాడిని ప్రోత్సహించారని ఆరోపణలు ఉన్నాయి. ట్రావెల్ ఆఫీస్ సీసీటీవీలో దాడి దృశ్యాలు రికార్డు అయ్యాయి.
డాక్టర్ ను బెదిరించారని కేసు నమోదు
పోలీసులకు ఫిర్యాదు చేస్తే మళ్లీ వచ్చి కొడతామని బెదిరించారని ట్రావెల్ సిబ్బంది వాపోయారు. ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై కేసు నమోదు అయింది. ఏలూరులో రౌడీ షీటర్ భీమవరపు సురేష్ ఆగడాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నెలలో ఏలూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ ని బెదిరించి కోట్ల రూపాయల ఆస్తి కాజేసే యత్నం చేశారు. ఈ ఘటనపై ఏలూరు 2వ పట్టణ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఏలూరు నగరంలో రౌడీ షీటర్స్ రెచ్చిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Bullet Bike Burnt: అనంతపురంలో పేలిన ఆయిల్ ట్యాంక్, బుల్లెట్ బైక్ దగ్ధం - కారణం అదే అంటున్న స్థానికులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

