SI Suicide : సర్పవరం ఎస్ఐ ఆత్మహత్య, సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని...
SI Suicide : కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లకు వెళ్లి వచ్చిన ఆయన ఇంతలో ఈ దారుణానికి పాల్పడ్డారు.
SI Suicide : కాకినాడ జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య సంచలనమైంది. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సర్పవరం ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోపాల కృష్ణ శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై స్వగ్రామం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట. గురువారం కోనసీమలో సీఎం బందోబస్తు ఏర్పాట్లకి వెళ్లి వచ్చారు ఎస్సై గోపాలకృష్ణ. ఆయన 2014 సంవత్సరం బ్యాచ్ కు చెందిన వారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు, ఓ గదిలో పిల్లలు భార్య నిద్రిస్తుండగా హాల్లో గన్ తో కాల్చుకుని గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
(ఎస్ఐ గోపాలకృష్ణ)
తగిన ఉద్యోగం రాలేదని
కోనసీమ జిల్లాలో సీఎం జగన్ ఇవాళ పర్యటించారు. సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి నిన్న రాత్రి ఇంటికి వచ్చారు ఎస్ఐ. అనంతరం ఈ దారుణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకొన్నాడా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన చదువుకు సరిపడిన ఉద్యోగం రాలేదని భార్య పావనితో తరచూ ఎస్ఐ ప్రస్తవించేవారని తెలుస్తోంది. ఈ కారణంతో గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకొన్నాడా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ ఉద్యోగానికి తాను సరిపోనని, తరచూ ఆవేదనకు గురయ్యేవారని తన బ్యాచ్ మేట్స్ తో కూడా చెప్పేవాడని పోలీసులుు అంటున్నారు. పోలీస్ శాఖ నుంచి ఎస్ఐకు ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా ఉన్నతాధికారులు చెప్పారు.
గతంలో ట్రాఫిక్ విభాగంలో విధులు
గతంలో కాకినాడలో ట్రాఫిక్ విభాగంలో గోపాలకృష్ణ విధుల నిర్వహించారు. వ్యక్తిగత కారణాలతోనే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోపాలకృష్ణ మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్ కు తరలించారు పోలీసులు. ఈ ఘటనకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ పరిశీలించారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత ఎస్ఐది ఆత్మహత్యా? ఇతర కారణాలా నిర్థారిస్తామన్నారు.
Also Read : Meerpet Murder: ఫేస్‌బుక్ ఫ్రెండుతో కలిసి ప్రియుడి హత్య కేసులో సంచలన నిజాలు! వాళ్ల ఫోన్లలో ఏముందంటే?