Kolkata: కోల్‌కతా కేసులో లై డిటెక్టర్ టెస్ట్ ఎందుకంత కీలకం? అసలు ఈ పరీక్ష ఎలా చేస్తారు?
Kolkata Case: కోల్‌కతా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్‌కి సీబీఐ లై డిటెక్టర్ టెస్ట్ చేయనుంది. అయితే..ఇసలు ఈ టెస్ట్ ఎలా చేస్తారన్నదే ఇప్పుడు చర్చకు వస్తోంది.
Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ (Lie Detector Test) చేయనున్నారు సీబీఐ అధికారులు. ఇప్పటికే ఆర్‌జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కి ఈ టెస్ట్ చేస్తున్నారు. నిందితుడు చెప్పిన విషయాల్లో ఏదైనా అబద్ధం ఉందని అనిపించినప్పుడు అధికారులు ఈ టెస్ట్ నిర్వహిస్తారు. అందుకే కోల్‌కతా కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి ఈ పరీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి కూడా తెచ్చుకున్నారు. సాధారణంగా దీన్ని లై డిటెక్టర్ టెస్ట్ అంటాం కానీ..టెక్నికల్‌గా Polygraph Test అంటారు. ఇన్వెస్టిగేషన్‌లలో నిందితులు కానీ, అనుమానితులు కానీ నిజం చెబుతున్నారా లేదా అని కన్‌ఫమ్ చేసుకోడానికి ఈ టెస్ట్ చేస్తారు. మరి ఈ పరీక్ష ఎలా చేస్తారు..? నిందితులు నిజాలు ఎలా బయటకు చెప్తారు..?
టెస్ట్ ఇలా చేస్తారు..
ఓ నిందితుడి సైకలాజికల్ ఇండికేటర్స్‌ని రికార్డ్ చేయడం కోసం ఈ టెస్ట్ చేస్తారు. అంటే ఆ వ్యక్తి బీపీ, పల్స్ రేట్, ఊపిరి తీసుకునే విధానం, బ్రీథింగ్ రేట్ ఇలా అన్నీ రికార్డ్ చేస్తారు. చేతులు, కాళ్లు కదలికలనూ రికార్డ్ చేస్తారు. ఇందుకోసం నాలుగు నుంచి ఆరు సెన్సార్లు వినియోగిస్తారు. ఈ టెస్ట్ మొదలు పెట్టినప్పుడు ఆ వ్యక్తిని ముందుగా మూడు, నాలుగు మామూలు ప్రశ్నలు అడుగుతారు. సిగ్నల్స్ అన్నీ సరిగ్గా పని చేస్తున్నాయా లేదా చెక్ చేస్తారు. ఆ తరవాత అసలు విచారణ మొదలు పెడతారు. ఆ మెషీన్‌లో ఓ పేపర్ ఉంటుంది. ఆ వ్యక్తి చెప్పే సమాధానాల ఆధారంగా ఆ పేపర్‌పై రికార్డ్ అవుతుంటాయి. ఆ వ్యక్తి నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా అన్నది ఆ పేపర్‌లోనే తెలిసిపోతుంది. అయితే...నిజం చెప్పినప్పుడు ఓ నంబర్, అబద్ధం చెప్పినప్పుడు మరో నంబర్ రికార్డ్ అవుతుంది. ఈ న్యూమరికల్ వాల్యూ ఆధారంగానే నిజానిజాలు తేల్చేస్తారు. ఓ ప్రశ్న అడిగినప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంది..? ఎలా ట్రిగ్గర్ అవుతున్నాడనేదీ అందులో రికార్డ్ అవుతుంది.
అబద్ధం చెప్పాడని ఎలా తెలుసుకుంటారు..?
పాలిగ్రాఫ్ ఆధారంగా ఈ టెస్ట్ రిజల్ట్‌ని తేల్చేస్తారు. అందులో సిగ్నల్స్ ఎలా ఉన్నాయనేదే ఆ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడా, నిజం చెబుతున్నాడా అన్నది చెప్పేస్తుంది. ఎప్పుడైతే ఈ సిగ్నల్‌లో అనూహ్య మార్పు కనిపిస్తుందో..అంటే ఉన్నట్టుండి ఆ వ్యక్తి బీపీ పెరగడం, శ్వాస వేగంగా తీసుకోవడం, హార్ట్ రేట్ పెరిగిపోవడం లాంటివి జరిగినప్పుడు అబద్ధం చెబుతున్నట్టు నిర్ధరించుకుంటారు. ఎంతో శిక్షణ తీసుకున్న వాళ్లే ఈ టెస్ట్ చేస్తారు. వాళ్లే చాలా కచ్చితంగా ఆ వ్యక్తి చెప్పేది నిజమా, అబద్ధమా తేల్చి చెప్పగలరు. మొట్టమొదటి సారి 19వ శతాబ్దంలో ఇటాలియన్ క్రిమినాలజిస్ట్ కెసారే లాంబోర్సో ఈ టెస్ట్ చేసినట్టు చెబుతారు. నిందితుల బీపీ ఆధారంగా నిజానిజాలు తేల్చేవారు. ఈ టెస్ట్‌లో దాదాపు 87% కచ్చితత్వం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే...ఒక్కోసారి ఎలాంటి తప్పు చేయని వాళ్లు కూడా నెర్వస్ ఫీల్ అవడం వల్ల రిజల్ట్‌లో అబద్ధం చెప్పినట్టే రికార్డ్ అవుతుంది. ఇలాంటి కేసులూ గతంలో చాలా సార్లు వచ్చాయి. అందుకే 100% అక్యురసీ ఉండదని అంటారు.
Also Read: Kolkata: నేనే నేరం చేయలేదు, అమాయకుడిని - కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న కోల్‌కతా కేసు నిందితుడు