Kolkata: నేనే నేరం చేయలేదు, అమాయకుడిని - కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న కోల్‌కతా కేసు నిందితుడు
Kolkata Case: కోల్‌కతా హత్యాచార నిందితుడు కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు ఏమీ తెలియదని, ఏ తప్పు చేయలేదని జడ్డ్ ముందు ఏడ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Kolkata Doctor Death Case Updates: కోల్‌కతా కేసు నిందితుడు సంజయ్ రాయ్ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకేమీ తెలియదని, అమాయకుడినని జడ్జ్ ముందు ఏడ్చాడు. 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చే ముందు ఇలా ఎమోషనల్ అయ్యాడు సంజయ్ రాయ్. ఇప్పటికే లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే...ఇప్పుడు ఉన్నట్టుండి నిందితుడు కన్నీళ్లు పెట్టుకోవడం కీలకంగా మారింది. పైగా తనను ఎవరో ఇరికించారని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. లై డిటెక్టర్ టెస్ట్ తరవాత తాను నిర్దోషి అని అందరికీ తెలుస్తుందని అన్నాడు. లై డిటెక్టర్ టెస్ట్‌కి సిద్ధంగానే ఉన్నానని చెప్పాడు.
"నేనే నేరమూ చేయలేదు. నన్ను కావాలనే ఇందులో ఇరికించారు. నేను నిర్దోషిని. ఈ లై డిటెక్టర్ టెస్ట్ తరవాతే ఇదే తేలుతుందన్న నమ్మకముంది"
- సంజయ్ రాయ్, నిందితుడు
అంతకు ముందు సంజయ్ రాయ్ లాయర్ కబితా సర్కార్ అతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ గురించి అంతా వివరించారు. కోర్టులో జడ్జ్ అడిగిన సమయంలో తాను ఈ పరీక్షకు సిద్ధంగానే ఉన్నానని, తాను నిర్దోషినని రుజువవుతుందని అన్నాడు. అయితే..అంతకు ముందు సీబీఐతో పాటు సిట్ అధికారులు సంజయ్ రాయ్‌ని విచారించారు. ఆ సమయంలో నేరాన్ని అంగీకరించాడు. ఆ రోజు తాను ఏం చేశాడో పూసగుచ్చినట్టుగా అంతా వివరించాడు. పైగా సీసీ కెమెరాలో సంజయ్ రాయ్ కనిపించడం, అక్కడే అతని బ్లూటూత్ డివైజ్ దొరకడం లాంటి ఆధారాలు మరింత బలం చేకూర్చాయి. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి నిందితుడు తానేమీ చేయలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Also Read: Kolkata: కోల్‌కతా కేసులో లై డిటెక్టర్ టెస్ట్ ఎందుకంత కీలకం? అసలు ఈ పరీక్ష ఎలా చేస్తారు?