అన్వేషించండి

Viral News: ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, ఆపై హత్య - శరీరమంతా లోతైన గాయాలు

Kolkata News: కోల్‌కత్తాలో ఓ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పటికే పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

Kolkata Doctor Murder: కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. RG కార్‌ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్‌లో ఆమె శవమై కనిపించింది. అర్ధనగ్నంగా ఉన్న ఆ బాడీని చూసి అంతా ఉలిక్కిపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. అంతకు ముందు ఇది హత్య మాత్రమే అని అనుకున్నా..పోస్టు మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వెల్లడైంది. ఇప్పటికే ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కొవ్వొత్తులతో ర్యాలీలు చేశారు. రాజకీయంగానూ ఈ ఘటన దుమారం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని మమతా సర్కార్‌పై బీజేపీ మండి పడుతోంది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపడుతున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తే ఈ నేరం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా మరో ఇద్దరు వైద్యులను ప్రశ్నించారు. 

అయితే..అటాప్సీ రిపోర్ట్‌లో ఆమెని లైంగికంగా వేధించినట్టు, అత్యాచారం జరిగినట్టు తేలింది. ప్రైవేట్ పార్ట్స్‌లో బ్లీడింగ్ అయినట్టు గుర్తించారు. అంతే కాదు. శరీరంపై పలు చోట్ల గాయాలున్నట్టు ఈ రిపోర్ట్‌లో తేలింది. "ఆమె కళ్లు, నోరు నుంచి విపరీతంగా రక్తస్రావమైంది. ముఖంపైనా గాయాలున్నాయి. ప్రైవేట్ పార్ట్స్‌లోనూ బ్లీడింగ్ జరిగింది. పొట్ట, కాళ్లు, మెడ, కుడి చేతిపైనా గాయాలున్నాయి" అని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కోల్‌కత్తా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 3-6 గంటల మధ్యలో ఈ ఘటన జరిగింది. మెడకు ఉరి బిగించి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. అటాప్సీ ఫుల్ రిపోర్ట్ వస్తే తప్ప ఓ అంచనాకు రాలేమని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనను విచారించేందుకు సిట్‌ని నియమించారు. తన కూతురుని అత్యాచారం చేసి హత్య చేశారని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధితురాలి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. కచ్చితంగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అటు బీజేపీ మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతోంది. వెంటనే నిందితులను పట్టుకుని కఠిన శిక్ష విధించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ఘటన జరగడం నిజంగా సిగ్గుచేటు అని మండి పడుతోంది. ఇక ఈ మెడికల్ కాలేజీ విద్యార్థులు హాస్పిటల్ బయట కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. దారుణంగా అత్యాచారం చేసి ఆ తరవాత చంపేశారని విద్యార్థులూ చెబుతున్నారు. సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. శాంతిభద్రతలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. త్వరలోనే ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

Also Read: Viral News: ఘోర ప్రమాదం, గాల్లో అదుపు తప్పి చక్కర్లు కొట్టి కుప్ప కూలిన విమానం - 62 మంది మృతి

 

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget