Crime News: ప్రేమ వ్యవహారం - యువకుడిపై కత్తితో దాడి చేయించిన యువతి, తిరుపతిలో దారుణం
Tirupati News: తిరుపతి నగరంలో ఓ థియేటర్‌లో యువకునిపై మరో యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే దీనికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
![Crime News: ప్రేమ వ్యవహారం - యువకుడిపై కత్తితో దాడి చేయించిన యువతి, తిరుపతిలో దారుణం knife attack on young man in a theatre in tirupati Crime News: ప్రేమ వ్యవహారం - యువకుడిపై కత్తితో దాడి చేయించిన యువతి, తిరుపతిలో దారుణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/14/c399d869f833869d32bc3f2280d5d9c91726316497716876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Attack On Young Man In Tirupati: ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన తిరుపతి (Tirupati) నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంబీయూ వర్శిటీ విద్యార్థి లోకేశ్ ఓ యువతితో కలిసి శనివారం స్థానిక పీజీఆర్ థియేటర్‌కు వెళ్లాడు. సినిమా చూస్తుండగా.. కార్తీక్ అనే మరో యువకుడు లోకేశ్‌పై కత్తితో దాడికి పాల్పడగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడిన యువకుడిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన తర్వాత దాడి చేసిన యువకుడు, యువతి పరారైనట్లు గుర్తించారు. సహచర విద్యార్థి లోకేశ్‌కు యువతే సినిమా టికెట్లు బుక్ చేసినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే కార్తీక్‌తో కలిసి యువతి దాడి చేయించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు యువకులతో యువతి ప్రేమాయణం నడిపినట్లు సమాచారం. బాధితుడు లోకేశ్‌ది ప్రకాశం జిల్లా గిద్దలూరు కాగా.. కత్తితో దాడి చేసిన కార్తీక్, యువతి ఇద్దరూ సూళ్లూరుపేటకు చెందినవారిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Also Read: Tragedy Incident: టీ పొడి అనుకుని పురుగుల మందుతో టీ - వృద్ధ దంపతులు మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)