News
News
X

Khammam: ఖమ్మంలో విషాద ఘటన... సాగర్ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతు

ఖమ్మం జిల్లాలోని సాగర్ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈతకు దిగిన యువకులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు.

FOLLOW US: 

ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దానవాయిగూడెం వద్ద సాగర్‌ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. ఆదివారం సాయంత్రం కాలువలో ఈత కొట్టేందుకు ఏడుగురు వెళ్లగా అందులో ముగ్గురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారు కేరళ రాష్ట్రానికి చెందిన వివేక్‌, అభయ్‌, సోనూగా తెలుస్తోంది. వీరంతా ఖమ్మంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉన్న కేరళ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏడుగురు యువకులు కలిసి సరదాగా ఈత కోసం కాలువలోకి దిగారు. నీటిలో సోను, అభయ్‌తో పాటు మరో యువకుడు గల్లంత అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read:  ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్

చిత్తూరు జిల్లాలో ముగ్గురు బాలురు గల్లంతు

చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో ముగ్గురు బాలురు గల్లంతు అయ్యారు.  రేణిగుంట మండలం జి.పాళ్యం ఎస్సీ కాలనీకి చెందిన నలుగురు బాలురు ఆదివారం ఉదయం స్వర్ణముఖి నదిలో కొండి కర్రలతో పడవ తయారు చేసి ప్రయాణం సాగించారు. అయితే ఒక్కసారిగా పడవ మునిగి పోవడంతో ముగ్గురు నదిలో కొట్టుకుని పోగా.. ఒక్కరు బయటపడ్డారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోనికి దిగిన పోలీసులు ముగ్గురు బాలురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలురు మునిగిపోయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని రోధిస్తున్నారు. 

Also Read: చోరీ కేసుపై సీపీ ప్రెస్ మీట్.. పోలీసులు, విలేకరుల ముందే నిందితుడు రచ్చ రచ్చ, భార్య గురించి గట్టిగా అరుస్తూ..

 ఆదివారం సెలవు కావడంతో నలుగురు చిన్నారులు నదిలో చేపలు పట్టేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. నదిలో చేపలు పట్టేందుకు కొండి కర్రలతో ఓ పడవ చేసుకున్నారు. నలుగురు చిన్నారులు కలిసి పడవపై నదిలో కొంత దూరం ప్రయాణించారు. ఆకస్మాత్తుగా పడవ నీటిలో మునిగిపోయింది. ముగ్గురు నదిలో గల్లంతయ్యారు. ఒకరిని స్థానికులు కాపాడారు. మరో ముగ్గురిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జి.పాళ్యం వద్ద స్వర్ణముఖి నదిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గల్లంతైన వారికోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. 

Also Read: కొడుకును ఖననం చేసిన మరుసటిరోజే ఉరేసుకున్న తండ్రి.. సమాధి వద్దనే అఘాయిత్యం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 19 Dec 2021 10:07 PM (IST) Tags: khammam Sagar canal Three drowned in sagar Khammam three drowned

సంబంధిత కథనాలు

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Crime News : బెజవాడలో కాల్‌మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !

Crime News :  బెజవాడలో కాల్‌మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !

రెచ్చిపోతున్న రౌడీ మూకలు- దాడులు, దౌర్జన్యాలతో సిక్కోలు ప్రజలు బెంబేలు

రెచ్చిపోతున్న రౌడీ మూకలు- దాడులు, దౌర్జన్యాలతో సిక్కోలు ప్రజలు బెంబేలు

Baby Kidnap: కరీంనగర్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం, 4 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!

Baby Kidnap: కరీంనగర్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం, 4 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!

Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

టాప్ స్టోరీస్

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !

KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !

YSRCP Vs Janasena : వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

YSRCP Vs Janasena :  వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !