By: ABP Desam | Updated at : 20 Apr 2022 10:25 AM (IST)
ఖమ్మంలో కీచకపర్వం
Molestation on Minor Girl : ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. బాలికలు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ వారిని నిత్యం వేధిస్తున్న కేసులు రోజూ ఏదోచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు అత్యాచార సంఘటనలు సంచలనం సృష్టించాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆర్‌ఎంపీ వైద్యుడు తన వద్దకు వైద్యానికి వచ్చిన మైనర్ బాలికపై ఆత్యాచారయత్నానికి పాల్పడగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలకలో దివ్యాంగురాలిపై ఓ కామాందుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది. ఒకే రోజు రెండు సంఘటనలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చాయి.
వైద్యానికి వెళ్లిన మైనర్ బాలికపై..
కడుపునొప్పితో వైద్యం తీసుకునేందుకు ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లగా ఆ వైద్యుడు ఆ బాలిక (Minor Girl)పై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం అమ్మగూడెం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక కడుపునొప్పి వస్తుండటంతో తన సోదరుడిని తీసుకుని రాజేశ్వరాపురంలోని ఆర్‌ఎంపీ వైద్యుడు సాంబమూర్తి వద్దకు వెళ్లాడు. వైద్యం పేరుతో ఆర్‌ఎంపీ వైద్యుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆర్‌ఎంపీ వైద్యుడిపై పోక్సో చట్టం (Pocso Act) ప్రకారం కేసు నమోదు చేశారు. వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.
దివ్యాంగురాలిపై లైంగికదాడి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పునుకుడుచెలక గ్రామ పంచాయతీ మర్రిగూడెం గ్రామానికి చెందిన ఓ దివ్యాగురాలు ఈ నెల 14వ తేదీన బహిర్భూమికి బయటకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన ఎట్టి కృష్ణ బాలిక ఒంటరిగా బయటకు వెళ్లడాని గమనించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం జరగడంతో ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయం గ్రామ పెద్దలకు చెప్పగా పరిష్కరిస్తామని చెప్పిన గ్రామ పెద్దలు విషయాన్ని బయటకు రాకుండా చూశారు. అయితే తమకు జరిగిన అన్యాయంపై ఎలాంటి న్యాయం జరగకపోవడంతో బాదితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Maoists: కరీంనగర్‌లో మళ్లీ మావోయిస్టుల అలజడి, కొరియర్లలో మందుగుండు సామాగ్రి - ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
Also Read: Puspha Knife Story : మూఢ భక్తితో దారి తప్పిన పుష్ప - కాబోయే భర్త పీక కోసిన కేసులో కీలక విషయాలు
Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !
Anantapuram: నిద్రలోనే ఘోరం- గ్యాస్ సిలిండర్ పేలి మూడేళ్ల పసిపాప సహా నలుగురు మృతి
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్
100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్
TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత