Khammam News : ఖమ్మం జిల్లాలో మరో సూది మందు హత్య, పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి భార్యను మర్డర్ చేసిన భర్త!
Khammam News : ఖమ్మం జిల్లాలో మరో సూది మందు హత్య వెలుగుచూసింది. సెలైన్ లో పాయిజన్ కలిపి రెండో భార్యను హత్య చేశాడో వ్యక్తి.
Khammam News : ఖమ్మం జిల్లాలో మరో ఇంజక్షన్ హత్య వెలుగు చూసింది. బైక్ పై లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బిక్షం అనే వ్యక్తి తన రెండో భార్యను హత్య చేసేందుకు ఈ ప్లాన్ అమలు చేశాడు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు డెలివరీ కోసం రెండో భార్యను బిక్షం తీసుకెళ్లాడు. హాస్పిటల్ లో సెలైన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె కాసేపటికే మృతి చెందింది. అయితే నేరం తన మీదకు రాకుండా ఉండేందుకు వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని ఆసుపత్రిలో ఆందోళన చేశాడు. ఏం జరిగిందో అర్థం కాని ఆసుపత్రి సిబ్బంది సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా రెండు రోజుల వ్యవధిలోనే ఖమ్మం జిల్లాలో రెండు సూది మందు హత్యలు జరగడంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు.
లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ తో హత్య
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం వల్లబి వద్ద ఈ నెల 19న ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని లిప్ట్ అడిగి అతడికి సూదిమందు ఇచ్చి నిందితుడు పరారైన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ విషయంలో విచారణ ప్రారంభించిన పోలీసులు సూదిమందు హత్యకు సంబందించిన కారణాలను వెలుగులోకి తెచ్చారు. చింతకాని మండలం బొప్పారం గ్రామానికిS చెందిన జమాల్ సాహెబ్‌ను తమ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. జమాల్ సాహెబ్ భార్య ఇమామ్‌బీ వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. ఈ క్రమంలో చింతకాని మండలం మత్కేపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గోద మోహన్‌రావుతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా అక్రమ సంబందంకు దారి తీసింది. మూడేళ్లుగా సాగుతున్న వీరి వివాహేతర సంబంధానికి ఇమామ్‌బీ భర్త జమాల్‌సాహెబ్ అడ్డుగా వస్తున్నారని భావించారు. అందుకే ఎలాగైన అతని అడ్డు తొలగించుకోవాలని భావించి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నర్సింశెట్టి వెంకటేశ్‌తో కలిసి హత్య చేసేందుకు పథకం రచించారు.
పెద్ద కుమార్తె వివాహానికి వెళ్తుంటే
వెంకటేష్‌కు సమీప బంధువైన బండి వెంకన్న సహాయంతో హత్య చేసేందుకు కావాల్సిన ఇంజక్షన్‌ను తెప్పించారు. గత కొద్ది రోజుల క్రితమే జమాల్‌సాహెబ్ భార్య ఇమామ్ బీ ఇంజిక్షన్ వేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎలాగైనా అతనిని అడ్డుతప్పించుకోవాలని భావించిన ఇమామ్ బీ, ఆమె ప్రియు మోహన్‌రావు... జమాల్‌సాహెబ్ ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా గండ్రాయిలో ఉన్న తన పెద్దకుమార్తె ఇంటికి సోమవారం వెళుతున్నాడని తెలుసుకున్నారు. ముందుగానే బాణాపురం గ్రామం వద్దకు చేరుకున్నారు. అప్పటికే అనుకున్న పథకం ప్రకారం ఆర్‌ఎంపీ వైద్యుడు బండి వెంకన్న లిప్ట్ అడిగి కొంత దూరం వెళ్లగానే అతనికి సూది మందు ఇచ్చాడు. అధిక డోస్ ఉన్న సూది మందు ఇవ్వడంతో జమాల్‌సాహెబ్ ద్విచక్రవాహనాన్ని ఆపాడు. బండి ఆగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కొంత దూరం వెళ్లాక మోహన్‌రావుతో కలిసి మరో ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. అప్పటికే సూది మందు ప్రభావం చూపడం, జమాల్‌సాహెబ్ ద్విచక్ర వాహనం నడిపే పరిస్థితిలో లేకపోవడంతో అటుగా వెళుతున్న వారు గమనించి అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ జమాల్‌సాహెబ్ మరణించారు. ఈ సంఘటన రెండు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది.
Also Read : Khammam Bike Lift Case: బైక్ లిఫ్ట్ మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు, వివాహేతర సంబంధమే కారణమా !