News
News
X

Khammam Bike Lift Case: బైక్ లిఫ్ట్ మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు, వివాహేతర సంబంధమే కారణమా !

Khammam Bike Life Case: లిఫ్టు ఇచ్చిన పాపానికి ప్రాణాలు కోల్పోయాడో వ్యక్తి. ఖమ్మం జిల్లాలో ఇంజక్షన్ ఇచ్చి వ్యక్తిని చంపిన కేసులో ఇద్దరు డ్రైవర్లు, ఆర్ఎంపీ ప్రమేం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

FOLLOW US: 

Khammam Bike Life Case: ఖమ్మం జిల్లా బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఓ అపరిచితుడికి లిఫ్ట్ ఇచ్చిన కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బైకు వెనుక కూర్చున్న వ్యక్తి ఇంజక్షన్ చేయడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చనిపోయాడు. ఈ హత్య కేసులు పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు నిందుతులను గుర్తంచారు. ఘటన సంచలనం కావడంతో రంగంలోకి దిగన పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో కేసును చేధించారు. జిల్లాలోని చింతకాని మండలం మున్నేటికి చెందిన వాళ్లే హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. జమాల్ సాహెబ్ ను చంపేందుకు పక్కా ప్రణాళిక రచించినట్లు వెల్లడి అయింది. నిందితుల్లో ఇద్దరు డ్రైవర్లు, ఆర్ఎంపీ ప్రమేయం ఉన్నట్లు తెలుసుకున్నారు. జమాల్ భార్య ఫోన్ కాల్ జాబితాలో హత్యకు పాల్పడ్డ నిందితుల ఫోన్ నంబర్లు ఉండడం, వారితోనే ఎక్కువ సార్లు మాట్లాడడం వంటి వాటిని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబధించిన పూర్తి వివరాలను ఈరోజు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. 

అసలు ఏం జరిగిందంటే? 
ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. తన కూతురును ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. 

మంకీ క్యాప్ ధరించిన నిందితుడు.. 
జమాల్ సాహెబ్ తన మోటర్ సైకిల్ పై వల్లబి మీదగా గండ్రాయి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడగగా, బైక్ ఆపి అతడికి లిఫ్ట్ ఇచ్చారు. అలా కొద్దిదూరం వెళ్లారో లేదో వెనుకాల కూర్చున్న వ్యక్తి తన బుద్ధి చూపించాడు. అప్పటికే మంకీ క్యాప్ పెట్టుకున్న ఆ గుర్తు తెలియని వ్యక్తి బాణాపురం దాటిన తరువాత వల్లబి సమీపంలో బైక్ నడుపుతున్న సాహెబ్‌కు వెనక నుంచి ఇంజక్షన్ ఇచ్చాడు ఆ నిందితుడు. దాంతో సాహెబ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. జమాల్ సాహెబ్ చనిపోయాడని నిర్ధారించుకున్న వెంటనే బైక్ పై నిందితుడు పరారైనట్లుగా పలువురు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో ఇంజక్షన్, సిరంజీ ఉన్నాయని తెలిపారు. స్ధానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ముదిగొండ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే జమాల్ చనిపోయాడని నిర్ధారించారు.

గతంలోనూ ఇంజక్షన్ దాడుల కలకలం.. 
గతంలోనూ ఏపీ, తెలంగాణలో ఇంజక్షన్ దాడులు కలకలం రేపాయి. తాజాగా అలాంటి ఘటనే జరగడంతో తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మరోసారి అందోళన నెలకొంది. గతంలోనూ బైకు మీద వెళ్లే వారిని టార్గెట్ గా చేసుకుని దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాలలో ఇంజెక్షన్ దాడుల నుంచి తప్పించుకుని వెళ్లిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదులు సైతం ఇవ్వగా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అపరిచిత వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చా సాయం చేద్దామని చూస్తే, అతడు తన బుద్ధి చూపించాడని స్థానికులు అంటున్నారు. మానవత్వంతో అవతలి వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేద్దామని చూడగా, బైక్ కోసం విషపు ఇంజెక్షన్ ఇచ్చి అమయాకుడ్ని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

Published at : 21 Sep 2022 09:34 AM (IST) Tags: khammam crime news Khammam News Latest Murder Case Khammam Bike Life Case TS Latest Crime News

సంబంధిత కథనాలు

Chandrababu Tweet : స్కూల్ పిల్లల వరకూ గంజాయి వచ్చేసింది, ఇది క్షమించరాని నేరం- చంద్రబాబు

Chandrababu Tweet : స్కూల్ పిల్లల వరకూ గంజాయి వచ్చేసింది, ఇది క్షమించరాని నేరం- చంద్రబాబు

Vizag Crime News : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ? విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !

Vizag Crime News : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ?  విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam