అన్వేషించండి

Shocking: బైక్‌పై లిఫ్ట్ అడిగాడు, ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడు - తరువాత ఏం జరిగిందంటే

బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఓ అపరిచితుడికి లిఫ్ట్ ఇచ్చిన కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బైకు వెనుక కూర్చున్న వ్యక్తి ఇంజక్షన్ చేయడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చనిపోయాడు.

Man Gives injection and killed Biker : తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఓ అపరిచితుడికి లిఫ్ట్ ఇచ్చిన కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బైకు వెనుక కూర్చున్న వ్యక్తి ఇంజక్షన్ చేయడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ముదిగొండ మండలం బాణాపురంలో జరిగింది. ఆ తరువాత నిందితుడు బైకుతో అక్కడినుంచి పరారయ్యాడని సమాచారం. బైకు కోసం లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.

లిఫ్ట్ ఇవ్వడమే అతడి పాలిట శాపమైంది.. 
బైక్ పై వెళ్తన్న వెక్తిని లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి బైక్ తీసుకొని పరారైన సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండంలో జరిగింది. సంచలన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. తన కూతురును ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. 

మంకీ క్యాప్ ధరించిన నిందితుడు
ఈ క్రమంలో జమాల్ సాహెబ్ తన మోటర్ సైకిల్ పై వల్లబి మీదగా గండ్రాయి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడగగా, బైక్ ఆపి అతడికి లిఫ్ట్ ఇచ్చారు. అలా కొద్దిదూరం వెళ్లారో లేదో వెనుకాల కూర్చున్న వ్యక్తి తన బుద్ధి చూపించాడు. అప్పటికే మంకీ క్యాప్ పెట్టుకున్న ఆ గుర్తు తెలియని వ్యక్తి బాణాపురం దాటిన తరువాత వల్లబి సమీపంలో బైక్ నడుపుతున్న సాహెబ్‌కు వెనక నుంచి ఇంజక్షన్ ఇచ్చాడు ఆ నిందితుడు. దాంతో సాహెబ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. జమాల్ సాహెబ్ చనిపోయాడని నిర్ధారించుకున్న వెంటనే బైక్ పై నిందితుడు పరారైనట్లుగా పలువురు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో ఇంజక్షన్, సిరంజీ ఉన్నాయని తెలిపారు. స్ధానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ముదిగొండ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే జమాల్ చనిపోయాడని నిర్ధారించారు.

గతంలోనూ ఇంజెక్షన్ దాడుల కలకలం..
గతంలోనూ ఏపీ, తెలంగాణలో ఇంజెక్షన్ దాడులు కలకలం రేపాయి. తాజాగా అలాంటి ఘటనే జరగడంతో తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మరోసారి అందోళన నెలకొంది. గతంలోనూ బైకు మీద వెళ్లే వారిని టార్గెట్ గా చేసుకుని దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాలలో ఇంజెక్షన్ దాడుల నుంచి తప్పించుకుని వెళ్లిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదులు సైతం ఇవ్వగా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అపరిచిత వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చా సాయం చేద్దామని చూస్తే, అతడు తన బుద్ధి చూపించాడని స్థానికులు అంటున్నారు. మానవత్వంతో అవతలి వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేద్దామని చూడగా, బైక్ కోసం విషపు ఇంజెక్షన్ ఇచ్చి అమయాకుడ్ని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Kurnool Nude Call: వీడియో కాల్‌లో బట్టలిప్పేసిన యువతి, తర్వాత చుక్కలు! ఆ వెంటనే సీబీఐ అని ట్విస్ట్

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget