By: ABP Desam | Updated at : 07 Aug 2021 03:33 PM (IST)
సునీల్ యాదవ్‌ను కోర్టులో ప్రవేశ పెడుతున్న సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి కేసు మిస్టరీ వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుడు సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ పది రోజుల కస్టడీకి తీసుకుంది. అంతకు ముందే ఆయనను దాదాపుగా నెల రోజుల పాటు ప్రశ్నించింది. కానీ అప్పట్లో ఆయన పూర్తి వివరాలు చెప్పలేదు. ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు లభించడంతో కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టాలని నిర్ణయించుకున్నారు. గోవాలో అరెస్ట్ చేసి పులివెందులకు సునీల్ యాదవ్‌ను సీబీఐ తీసుకు వచ్చింది. కోర్టులో హాజరు పరిచింది. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన కడప కేంద్ర కారాగారంలో ఉన్నారు. కస్టడకి ఇవ్వడంతో ఇవాళ కడపజైలు నుంచి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న అతిథిగృహానికి తరలించారు. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ప్రమేయంపై చాలా అనుమానాలు ఉన్నాయని ఇప్పటికే రంగన్న వాంగ్మూలంలో కూడా సునీల్ పేరు ప్రస్తావించడంతో.. అతనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని సీబీఐ కోర్టులో వాదించింది.
సునీల్ యాదవ్ కుటుంబం మొత్తం వైఎస్ వివేకాకు సన్నిహితులు. వారితో అత్యంత చనువుగా ఉంటున్నఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివేకా హత్య కేసు వెనుక మిస్టరీ సునీల్‌కు తెలిసే ఉంటుందని.. లేకపోతే.. ఆ కుట్రలో భాగమై ఉంటారని సీబీఐ అధికారులు నమ్ముతున్నారు. ఈ కేసు కోసం ఇప్పటికే రెండు నెలలుగా సీబీఐ అధికారులు పులివెందులలోనే మకాం వేశారు. కేసును చేధించి వెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు. సాక్ష్యాలు మాయం చేసిన వారిని... మాయం చేయడానికి ప్రయత్నించిన వారిని సీబీఐ అధికారులు ఇంత వరకూ ప్రశ్నించలేదు. సునీల్ యాదవ్ కస్టడీలో చెప్పే విషయాలను బట్టి సీబీఐ.. వారిపైనా దృష్టి పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి వివేకా కేసు దర్యాప్తు మాత్రం కీలక దశకు చేరుకుందని సీబీఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సీబీఐ అధికారులు పులివెందులలో దాదాపుగా ప్రతీ రోజు మాజీ డ్రైవర్ దస్తగిరిని... వివేకా సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డిని పిలిచి ప్రశ్నించారు. అప్పుడప్పుడూ.. వివేకా ఇంటిని పరిశీలిస్తున్నారు. వైఎస్ సునీత ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పదిహేను మంది ప్రధాన నిందితులు అందర్ని సీబీఐ ప్రశ్నించలేదు. మధ్యలో విచారణ అధికారిని మార్చడం కూడా వివాదాస్పమయింది. చివరికి సీబీఐ అధికారులు సునీల్ యాదవ్ ప్రమేయంపై సాక్ష్యాలు గుర్తించి అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. దీంతో ప్రజల్లోనూ ఈ కేసు మిస్టరీ వీడిపోతుందన్న అభిప్రాయం వైఎస్ కుటుంబ సభ్యుల్లోనూ కనిపిస్తోంది. వైఎస్ వివేకా కుమార్తె సునీత.. సీబీఐ అధికారులకు ఎలాంటి సమాచారం కావాలన్నా తక్షణం అందిస్తున్నారు.
Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ
Tirupati Police Thiefs : దోపిడీ చేసిన పోలీసులు - సీఐ, ముగ్గురు ఎస్సైలపై వేటు ! వీళ్లనేమనాలి ?
Crime News: తోడు దొంగలకు ఆ తండ్రీకొడుకులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్
Sri Satyasai District Auto Accident: ఆటో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- బాధితులకు రూ. 10 లక్షల పరిహారం- రూ. 50 లక్షలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్
Sri Satyasai: సత్యసాయి జిల్లాలో ఘోరం, ఆటోలో వెళ్తున్న 8 మంది సజీవ దహనం
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !
IND Vs ENG Squads: ఇంగ్లండ్‌తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!