అన్వేషించండి

Mobile Addiction: ఫోన్ వాడొద్దన్నందుకు తల్లిపై కొడుకు దాడి - ప్రాణాలతో పోరాడి చివరకు మృతి

ఫోన్ వాడొద్దని చెప్పినందుకు ఓ యువకుడు తల్లినే చంపేసిన ఘటన కేరళలో జరిగింది. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో అతన్ని మెంటల్ ఆస్పత్రికి తరలించారు.

మొబైల్ కు ఎడిక్ట్ అయిన ఓ యువకుడు తన తల్లినే చంపేశాడు. ఫోన్ వాడొద్దని చెప్పిన పాపానికి వృద్ధురాలైన తల్లి తలను పట్టుకుని గోడకేసి కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన కేరళలో జరిగింది.

ఏం జరిగిందంటే.?

కేరళ కన్నూర్ జిల్లా కినిచిరా గ్రామానికి చెందిన రుక్మిణీదేవి (63), తన తల్లి సుజీత్ తో కలిసి ఉంటోంది. కాగా, సుజీత్ మొబైల్ కు బానిసగా మారాడు. ఈ వ్యసనం నుంచి బయటకు తీసుకు రావాలని తల్లి మొబైల్ వాడకం తగ్గించాలని సుజీత్ ను కోరింది. దీంతో కోపోద్రిక్తుడైన సుజీత్ తల్లిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తల్లి తలను పట్టుకుని గోడకేసి కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా ఓ వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు మానసిక రోగి

పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు మానసిక రోగి అని, వైద్య నివేదికను చూసిన కోర్టు అతన్ని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితుడికి చాలా కాలంగా మొబైల్ అడిక్షన్ ఉందని పోలీసులు తెలిపారు. గతంలోనూ ఓసారి అడిక్షన్ సెంటర్ లో చేరాడని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అదే వ్యసనానికి గురైనట్లు పేర్కొన్నారు. నిందితుడు నేరం అంగీకరించాడని, తానేం చేస్తున్నాడో తెలియడం లేదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

పెళ్లి చేయలేదని తండ్రినే చంపేశాడు

మరోవైపు, ఏపీలోనూ శనివారం దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలోని కనకదుర్గమ్మ కాలనీలో బాలభద్రాచారి అనే వ్యక్తిని అతని కుమారుడు గురు నారాయణ కత్తితో దాడి చేసి చంపేశాడు. తనకు పెళ్లి చేయడం లేదనే మనస్తాపంతో పథకం ప్రకారం తండ్రిని బయటకు తీసుకెళ్లి గొంతు కోసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget