Kerala Crime News: ఆలిని చంపాడు, ఆపై పూడ్చేశాడు - ఏమీ ఎరగనట్టు మిస్సింగ్ కేసు పెట్టాడు!
Kerala Crime News: కట్టుకున్న భార్యనే హత్య చేశాడు. ఆపై ఇంటి ఆవరణలోనే పూడ్చేశాడు. ఏమీ ఎరగనట్టు కొంత కాలం తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి భార్య మిస్సైందంటూ కేసు పెట్టాడు. చివరకు..!
Kerala Crime News: కట్టుకున్న భార్యనే అత్యంత దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసి చంపేశాడు. ఆపై తన ఇంటి ఆరణలోనే భార్య మృతదేహాన్ని పూడ్చేశాడు. ఆరు నెలల పాటు హాయిగా ఎంజాయ్ చేశాడు. ఆపై తన భార్య కనిపించడం లేదంటూ డ్రామా మొదలు పెట్టాడు. పోలీసుల వద్దకు వెళ్లి భార్య మిస్సైందని కేసు పెట్టాడు. అనంతరం రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. కానీ అంతకంటే ముందే పోలీసులకు చిక్కాడు.
అసలేం జరిగిందంటే..?
కేరళలలోని కొచ్చికి చెందిన సంజీవ్, రమ్య దంపతులు. అయితే ఏడాదిన్నర క్రితం అంటే 2021వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన భార్యను రమ్మ గొంతు కోసం మరీ దారుణంగా చంపేశాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఏమీ తెలియనట్లుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి.. తన భార్య రమ్య అదృశ్యం అయిందంటూ ఫిర్యాదు చేశాడు. 2022వ సంవత్సరం ఫిబ్రవరిలో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులకు.. భర్త సంజీవ్ పై అనుమానం కల్గింది. భార్య కనిపించకుండా పోయిన ఆరు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు సంజీవ్ పై నిఘా పెట్టాడు. ఏడాదికి పైగా కేసు విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నాడు.
అన్ని ఆధారాలు సేకరించి మరీ సంజీవ్ ను అరెస్ట్ చేశారు. భార్యాభర్తలిద్దరికీ ఫోన్ కాల్స్ విషయంలో గొడవ జరిగి.. భార్య రమ్యను సంజీవ్ హత్య చేశాడు. అనంతరం కొచ్చి సమీప ఎడవనక్కడ్ గ్రామంలోని తన ఇంట్లోనే పూడ్చేశాడు. ఈ హత్య అనంతరం రమ్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని బంధువులు, చుట్టు పక్కల వాళ్లను నమ్మించాడు. మరో పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధం అయ్యాడు. భార్య రమ్యను చంపిన భర్త సంజీవ్ ను అరెస్ట్ చేసి కీలక సమయంలో అసలు విషయం బయట పెట్టారు.
నాలుగు రోజుల క్రితం ములుగులో.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ప్రియుడితో కలిసి భర్తను హతమర్చిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పూరూరు గ్రామంలో సోమవారం జరిగింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారం హతమార్చిన ఘటన వాజేడు మండలంలో కలకలం రేపుతోంది. వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన గొడ్డె బసవయ్య, సుజాత భార్య భర్తలు. అయితే బసవయ్య భార్య సుజాత అదే గ్రామానికి చెందిన దర్శన్ బాబుతో కొంత కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై భార్య, భర్తలు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టుకొని వార్నింగ్ ఇచ్చారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ప్రియుడు పెండకట్ల దర్శన్ బాబుతో కలిసి బసవయ్యను భార్య సుజాత హతమార్చింది. బసవయ్య బావ గోట లాలయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పేరూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బసవయ్య మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు.