(Source: ECI/ABP News/ABP Majha)
Karnataka News: భార్య ముస్తాబవుతోందని తట్టుకోలేని భర్త! ఫ్రెండ్స్‌తో కలిసి హత్య
Crime News: భార్య అందంగా ముస్తాబవడం తట్టుకోలేక ఆమెను స్నేహితులతో కలిసి చంపేశాడు. లిప్‌స్టిక్‌లు వేసుకుని, టాటూలతో గ్రామంలో తిరగొద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమెను అంతమొందించాడు.
Karnataka Crime News: ఏ మగాడైనా తన భార్య అందంగా తయారవాలని కోరుకుంటారు. అందరి కన్నాఅందంగా కనపడాలని ఖరీదైన చీరలు, నగలు కొనిపెడతారు. అందమైన భార్య దక్కినందుకు సంతోషపడతారు. కానీ భార్య అందంగా ముస్తాబవుతోందనే కారణంతో ఓ వక్తి తన భార్యను స్నేహితులతో కలిసి కడతేర్చిన ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆలయానికి వెళదామని వెంటబెట్టుకెళ్లి ఆమెను చంపేసి మృతదేహాన్ని అడవిలో పారేశాడు.
కర్నాటక రాష్ట్రం రామనగర జిల్లాలో ఈ దారుణం జరిగింది. మాగడి అనే ఏరియాలో ఉమేశ్, దివ్య(32) అనే దంపతులు నివసిస్తున్నారు. దివ్యకు అందంగా ఉండటమంటే ఇష్టం. అందంగా కనపడేందుకు లిప్ స్టిక్స్ వంటివి వాడటంతోపాటు ఒంటిపై టాటూలు వేయించుకోవడం సరదా. అయితే ఇవన్నీ వద్దని తరచూ ఉమేశ్ తన భార్యకు చెప్పేవాడు. మేకప్ వేసుకుని టాటూలతో గ్రామంలో తిరగడం తట్టుకోలేకపోయేవాడు. ఎన్నిసార్లు వారించినా వినకపోవడంతో వారి మధ్య గొడవలు జరిగేవి. చివరికి దివ్య తన పద్ధతి మార్చుకోకపోగా భర్తనే వద్దనుకుంది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ కేసు విషయంలోనే మంగళవారం కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే ఇకపై తనను వేధించనని, నీ ఇష్టం వచ్చినట్టు మేకప్ అయినా అడ్డుచెప్పనని ఉమేశ్ తన భార్యకు చెప్పాడు. మనం కలిసి ఉందామని నమ్మించాడు.
భర్త నిజంగా మారిపోయాడని నమ్మింది దివ్య. ఇక తన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చులే అనుకొంది. ఉమేశ్ గుడికి పోదాం అనగానే ఆయనతోపాటు ఊజగల్లు గుడికి వెళ్లింది. అయితే భార్యను అంతం చేయాలని ముందస్తుగానే నిర్ణయించుకున్న ఉమేశ్.. ఆ ప్రకారమే అక్కడికి తన స్నేహితులను కూడా రప్పించాడు. కొండప్రాంతానికి తీసుకెళ్లి తన నలుగురు స్నేహితులతో కలిసి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేసి ఏమీ ఎరగనట్టు వెళ్లిపోయాడు. దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉమేశ్ స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తామే హత్య చేసినట్టు అంగీకరించారు. మృతురాలి భర్త ఉమేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఉమేశ్, మరో స్నేహితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇటీవల జరుగుతున్న నేరాలను, వాటి వెనుక ఉన్న కారణాలను గమనిస్తే దానికే చంపేయాలా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. అనుమానాలు, ఇగోలు, అతిగా ఊహించుకోవడాలు, వ్యక్తిగత ద్వేషాలు సమాజంలో హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. మరీ దారుణంగా అనుమానాల కారణంగా భార్యలను భర్తలు, భర్తలను భార్యలు చంపించడం మరీ ఎక్కువైపోతోంది. తాజాగా భార్య అందంగా తయారవుతోందనే కారణంతో ఒక భర్త తన భార్యను గుడికి వెళదామని నమ్మించి తీసుకెళ్లి చంపేశాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.