అన్వేషించండి

Splendor Siddha Reddy Arrest: అతడి పేరు సిద్ధారెడ్డి..స్ప్లెండర్ సిద్ధారెడ్డి.. స్ప్లెండర్ బైకుల్ని మాత్రమే మాయం చేస్తాడు !

Ballari Bike Thief Siddha Reddy: కర్ణాటకలో మోస్ట్ వాంటెడ్ దొంగ ‘స్ప్లెండర్ సిద్ధారెడ్డి’ని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం ఆటో డ్రైవర్ గా పని చేస్తాడు. రాత్రికి స్ప్లెండర్ బైకుల్ని మాయం చేస్తాడు.

Hero Splendor Theft Cases Karnataka : కర్ణాటకలో  స్ప్లెండర్  ద్విచక్ర వాహనదారులకు నిద్రలేకుండా చేసిన    ఒక మోస్ట్ వాంటెడ్ బైక్ దొంగను బళ్లారి  జిల్లా పోలీసులు ఎట్టకేలకు పక్కా స్కెచ్‌తో అదుపులోకి తీసుకున్నారు. పైకి సాధారణ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నట్లు నటించే సదరు వ్యక్తి, లోపల మాత్రం అంతరాష్ట్ర బైక్ దొంగగా చలామణి అవుతున్నాడు. హీరో మోటోకార్ప్‌కు చెందిన స్ప్లెండర్  మోడల్ బైకులను టార్గెట్ చేయడంలో అతనికి ఉన్న అసాధారణ నైపుణ్యం చూసి..  పోలీసులు అతనికి ఏకంగా స్ప్లెండర్ సిద్దారెడ్డి  అనే నూతన నామకరణం చేసేశారు.
 
 ఆటో డ్రైవర్ అవతారం వెనుక అసలు దందా! 

పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. సిద్ధారెడ్డి పగటిపూట బళ్లారి నగర వీధుల్లో ఆటోరిక్షా నడుపుతూ రోడ్లపై ఎక్కడెక్కడ ఏ బైకులు పార్క్ చేసి ఉన్నాయి, ఎక్కడ జనసంచారం తక్కువగా ఉందనే విషయాలపై పక్కాగా నిఘా పెట్టేవాడు. ఆటో డ్రైవింగ్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం సమాజం కళ్లల్లో కప్పడానికేనని, అతని లగ్జరీ జీవితానికి అసలు వనరు మాత్రం రాత్రి వేళల్లో చేసే బైక్ దొంగతనాలేనని బళ్లారి ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని నమ్మకమైన, డిమాండ్ ఉన్న స్ప్లెండర్ బైకులనే అతను టార్గెట్ చేసేవాడు.
  
 క్షణాల్లో లాక్ ఓపెన్.. అందుకే ఆ పేరు! 

హీరో స్ప్లెండర్ బైకుల లాకింగ్ సిస్టమ్‌ను డ్యామేజ్ చేయడంలో  మాస్టర్ కీ  సాయంతో క్షణాల వ్యవధిలో అన్‌లాక్ చేయడంలో సిద్ధారెడ్డి ఎక్స్‌పర్ట్. ఎంతటి పటిష్టమైన లాక్ ఉన్నప్పటికీ, యజమాని అలా వెళ్లి ఇలా వచ్చేలోపు బైక్‌ను స్టార్ట్ చేసుకుని పరారవ్వడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ఎటువంటి అత్యాధునిక పరికరాలు లేకుండానే కంపెనీ లాక్‌లను డికోడ్ చేయగల ఈ వింత నైపుణ్యం వల్లే కన్నడ నేర ప్రపంచంలో ఇతనికి స్ప్లెండర్ సిద్దారెడ్డి అనే మోస్ట్ పాపులర్ ముద్ర పడింది. 

 
 నాలుగు జిల్లాల్లో నెట్‌వర్క్.. నకిలీ పత్రాలతో అమ్మకాలు! 

సిద్ధారెడ్డి దొంగతనాల నెట్‌వర్క్ కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాలేదు. కర్ణాటకలోని బళ్లారి, విజయనగర, చిత్రదుర్గ , వాటి పరిసర సరిహద్దు జిల్లాల పరిధిలో ఇతగాడు భారీగా బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగిలించిన బైకులను నేరుగా ఇతర మారుమూల గ్రామాలకు తీసుకెళ్లి, అక్కడ అమాయక ప్రజలకు నమ్మకం కలిగించేలా నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను  , ఆర్సీ బుక్కులను సృష్టించి తక్కువ ధరలకే విక్రయించేవాడు. సెకండ్ హ్యాండ్ బైకులు అంటూ నమ్మించి సొమ్ము చేసుకునేవాడు. 

 సీన్ రివర్స్.. భారీగా బైకులు రికవరీ! 

గత కొన్ని రోజులుగా వరుసగా నమోదవుతున్న బైక్ దొంగతనాల కేసులను సీరియస్‌గా తీసుకున్న బళ్లారి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించి, పక్కా సమాచారంతో సిద్ధారెడ్డిని ఆటోతో సహా వెంబడించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుండి భారీ సంఖ్యలో దొంగిలించబడిన స్ప్లెండర్ మోటార్ సైకిళ్లను, నకిలీ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధారెడ్డి అరెస్ట్‌తో పలు జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న బైక్ దొంగతనాల కేసుల మిస్టరీ వీడిందని, దీని వెనుక ఇంకా ఎవరైనా ముఠా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Meerpet Knife Attack: మీర్‌పేట్‌లో దారుణం.. అత్తింటి వారిపై అల్లుడు కత్తితో దాడి.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
మీర్‌పేట్‌లో దారుణం.. అత్తింటి వారిపై అల్లుడు కత్తితో దాడి.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
PDS Rice Recycling: సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
Nagole Missing Boys: అమ్మ మందలించిందని ఇంట్లోంచి పారిపోయిన అన్నదమ్ములు.. ఇంకా దొరకని ఆచూకీ!
అమ్మ మందలించిందని ఇంట్లోంచి పారిపోయిన అన్నదమ్ములు.. ఇంకా దొరకని ఆచూకీ!
Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Tips To Soft Hair : జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తోందా? మృదువుగా, మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే
జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తోందా? మృదువుగా, మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే
AP MPTC ZPTC Elections: ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
Ramayana Mistakes: మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Dark Underarms : అండర్ ఆర్మ్స్ నల్లగా మారాయా? చంకల్లో నలుపుదనాన్ని తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
అండర్ ఆర్మ్స్ నల్లగా మారాయా? చంకల్లో నలుపుదనాన్ని తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
IND VS SL Vizag ODI :  ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Embed widget