అన్వేషించండి

Gade Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?

Gade Sai Krishna Case: అటు పొలిటికల్ సర్కిల్‌లో, ఇటు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పెను సంచలనంగా మారిన సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఖాయంగా కనిపిస్తున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సాయికృష్ణ లాకప్ డెత్‌గా నిర్ధారించి, CI నాగరాజు అరెస్ట్.
  • నాగరాజుకు సహకరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ దృష్టి.
  • మరో ప్రైవేటు వ్యక్తి పాత్రపైనా సిట్ లోతుగా ఆరా తీస్తోంది.
  • మృతదేహం ఆచూకీ, నాగరాజు సన్నిహితుల అరెస్టుకు దర్యాప్తు.

Gade Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే దీన్ని లాకప్‌డెత్‌గా నిర్దారించిన సిట్ అధికారులు మరింత దూకుడుగా విచారణ చేస్తున్నారు. కేసులో కీలకంగా ఉన్న సిఐ నాగరాజును అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాయికృష్ణ కేసులో మొత్తం వ్యవహారాన్ని ఆయన ఒక్కడే నడిపించే ఛాన్స్ లేదని గ్రహించిన సిట్ అధికారులు మరింత మందిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మరికొందరు ఎవరు అనేది ఇప్పుడు కృష్ణ లంక పోలీస్ స్టేషన్‌లో హాట్‌టాపిక్ అవుతోంది. నాగరాజుకు సన్నిహితంగా తిరిగిన వారు, సాయికృష్ణ కేసులో ఇన్వాల్వ్‌ అయిన వారందరూ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. 

సాయికృష్ణ కేసులో మరికొందరి పాత్రపై ఆరా

సాయికృష్ణ కేసులో ఇన్‌స్పెక్టర్ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన సిట్ అధికారులు మరింత సమాచారం కోసం లోతుగా దర్యాప్తు స్టైల్ మారుస్తున్నారు. సాయికృష్ణను హత్య చేసి, మృతదేహాన్ని మాయం చేయడంలో నాగరాజుకు మరికొందరి సహకారం ఉందని నిర్దారణకు వచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై దృష్టి పెట్టారు. త్వరలోనే ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను విచారణకు పిలిచే అవకాశం ఉంది. వారితో ఓ ప్రైవేట్ వ్యక్తి పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తి స్టేషన్‌కు తరచూ వచ్చి వెళ్లే వారని సమాచారం. అందుకే ఆ వ్యక్తి సమాచారం సేకరిస్తున్నారు. 

కీలక విషయాలపై నోరు విప్పని నాగరాజు

మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన విషయాన్ని వాంగ్మూలాల ఆధారంగా అధికారులు నిర్దారించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సేకరించిన నమూనాల ఆధారంగా సాయికృష్ణ మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసులో కీలక పురోగతి ఉన్నప్పటికీ మృతదేహం ఆచూకీ ఇంకా లభించలేదు. అరెస్ట్ అనంతరం నాగరాజును గంటల తరబడి సిట్ అధికారులు విచారించారు. ఆయన మాత్రం దేనికీ సమాధానం చెప్పడం లేదు. కీలక ప్రశ్నలకి కూడా నాగరాజు నోరు విప్పడం లేదు. అందుకే వేరే రూట్‌లో సిట్ అధికారులు విచారణ మొదలు పెట్టనున్నారు. నాగరాజుకు సన్నిహితంగా వ్యవహరించిన సిబ్బందిని విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు. 

వారి అరెస్టు తప్పదా?

మృతదేహం ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగుతోందని కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. కోర్టుకు కూడా సిట్ దర్యాప్తు కోసం ఎదురు చూస్తోంది. వారు విచార చేసిన అనంతరం కేసుపై కోర్టులో మరోసారి వాదనలు జరగనున్నాయి. ఓ వైపు కోర్టు, మరోవైపు ప్రభుత్వం ఇలా అన్ని వైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నందున కేసును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అందుకే నాగరాజు సన్నిహితులపై దృష్టి పెట్టారు. అయితే వారు కూడా విచారణకు సహకరిస్తే సరే లేకుంటే వారిని కూడా అరెస్టు చేసే ఛాన్స్ చాలా ఎక్కువగానే ఉంది. 

సాయికృష్ణది లాకప్‌డెత్‌గా తేల్చినప్పటి నుంచి నాగరాజుకు సన్నిహితంగా ఉండే సిబ్బంది, మరికొందరు వ్యక్తులు అజ్ఞాతంలోకి జారుకున్నారు. వారికి ఏ క్షణంలోనైనా పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉంది. వారందరి గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ క్షణం ఎలాంటి విషయాలు వినాల్సి ఉంటుందో అని భయం భయంగా కాలం గడుపుతున్నారు. మరోవైపు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా తన బిడ్డ కేసులో మరికొందరి పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సిట్ దర్యాప్తు కూడా ఆ దిశగానే సాగుతోంది. 

Frequently Asked Questions

సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు స్థితి ఏమిటి?

సిట్ అధికారులు సాయికృష్ణ మరణాన్ని లాకప్ డెత్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ కేసులో సిఐ నాగరాజును అరెస్టు చేసి విచారిస్తున్నారు.

సాయికృష్ణ కేసులో ఎంతమందిని అరెస్టు చేశారు? ఇంకెవరి పాత్ర ఉంది?

ఈ కేసులో ప్రధానంగా సిఐ నాగరాజును అరెస్టు చేశారు. మృతదేహాన్ని మాయం చేయడంలో మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక ప్రైవేట్ వ్యక్తి పాత్ర ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది.

సాయికృష్ణ మృతదేహం ఆచూకీ లభించిందా? అరెస్ట్ అయిన నాగరాజు విచారణకు సహకరిస్తున్నారా?

సాయికృష్ణ మృతదేహం ఆచూకీ ఇంకా లభించలేదు. అరెస్ట్ అయిన సిఐ నాగరాజు మాత్రం కీలక ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా దర్యాప్తుకు సహకరించడం లేదు.

సాయికృష్ణ కేసులో సిట్ తదుపరి చర్యలు ఏమిటి?

నాగరాజుకు సన్నిహితంగా ఉన్న సిబ్బందిని విచారించడం ద్వారా కీలక విషయాలు రాబట్టాలని సిట్ భావిస్తోంది. అవసరమైతే, వారిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget