అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Karimnagar: ఇంట్లోకి చొరబడి యువతి కిడ్నాప్.. తర్వాత కాసేపటికే ట్విస్ట్, అతను ఎవరంటే..

కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. వీరి నిశ్చితార్థ ఫోటోలను చూసిన ఓ యువకుడు కిడ్నాప్‌కు యత్నించాడు.

పెళ్లి కావాల్సిన యువతిని దుండగులు ఆమె ఇంట్లోకి వెళ్లి కిడ్నాప్ చేసిన ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. జిల్లాలోని ధర్మపురిలో యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి, కిడ్నాప్‌కు యత్నించారు. ఆమెను కొంత దూరం తీసుకుపోయి చివరికి వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకొని యువతి అవాక్కయింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన 23 ఏళ్ల యువతికి వెల్గటూర్‌ మండలంలోని కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన ఓ యువకుడు కిడ్నాప్‌కు యత్నించాడు.

ఈ ఫోటోలు చూసిన సారంగాపూర్‌ మండలంలోని రేచపెల్లికి చెందిన మంగళారపు రాజేందర్‌ అనే యువకుడు యువతిని కిడ్నాప్ చేయాలని భావించాడు. ఈ మేరకు తన ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం ఆ యువతి ఇంటికి వెళ్లాడు. లోపల ఒంటరిగా ఉన్న ఆమెను లాక్కొని బయటికి వచ్చి, బలవంతంగా కారులో ఎక్కించాడు. జాతీయ రహదారి పక్కనున్న దుర్గమ్మ కాలనీ నుంచి కమలాపూర్‌ మార్గంలో తీసుకెళ్తుండగా మధ్యలోనే కారు చెడిపోయింది.

అదే సమయంలో బాధితురాలు గట్టిగా ఏడుస్తూ కేకలు వేసింది. దీంతో రాజేందర్‌ కోపంతో ఊగిపోతూ కత్తితో ఆమెను గాయపరిచాడు. ఆమెకు తీవ్రమైన రక్తస్రావం జరగ్గా యువతి అరుపులు విన్న  చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు కూడా స్థానికులు సమాచారం ఇవ్వడంతో వారు కూడా అక్కడికి వచ్చారు. దీంతో కంగారు పడ్డ నలుగురు నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు కారును స్వాదీనం చేసుకొని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువతి తల్లిదండ్రులను పోలీస్‌ స్టేషకు రప్పించి.. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం వెతుకున్నామని పోలీసులు వెల్లడించారు.

నిందితుడు ఎవరంటే..
కిడ్నాప్‌నకు యత్నించిన రాజేందర్, బాధిత యువతి క్లాస్‌మేట్. ఇద్దరూ డిగ్రీ కలిసి చదువుకున్నారు. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుందామని ఇద్దరు వారి వారి కుటుంబాల్లో చెప్పారు. కులాలు వేరు కావడంతో వారు నిరాకరించినట్లు సమాచారం. రెండు రోజుల కిందట కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో యువతికి పెళ్లి నిశ్చయం కావడంతో.. ఇది తెలుసుకున్న రాజేందర్‌ తన స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు ఇలా ప్రయత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు.

Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్

Also Read: తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ.. 2 కేసులు గుర్తింపు, మరో బాలుడికి కూడా.. డీహెచ్ వెల్లడి

Also Read: చాక్లెట్ ఇస్తానని మతిస్తిమితం లేని యువతిపై వృద్ధుడి లైంగిక దాడి.. మరో బాలికపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

Also Read: Revant Reddy : సొంత పార్టీకే భవిష్యత్ లేదు..ఇక జాతీయ రాజకీయాలా ? .. కేసీఆర్ తమిళనాడు టూర్‌పై రేవంత్ రెడ్డి విసుర్లు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Embed widget