Kamareddy: కామారెడ్డిలో దారుణం - లాడ్జీలో తల్లీకుమారుడు ఆత్మహత్య, సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో !

Mother and Son Commits Suicide: ఓ లాడ్జిలో తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తల్లి ట్రీట్‌మెంట్ కోసం కామారెడ్డికి వచ్చి.. బలవన్మరణం చెందడం కలకలం రేపుతోంది.

FOLLOW US: 

Kamareddy: Mother and Son Commits Suicide at Lodge in Kamareddy Town: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తల్లి వైద్యం కోసం ఏప్రిల్ 11న లాడ్జికి వచ్చారు. అంతలోనే ఏం జరిగిందో తెలియదుగానీ తల్లీకుమారుడు ఇద్దరు నిప్పంటించుకుని బలవన్మరణం చెందారు. చనిపోయిన వారిని రామాయంపేటకు చెందిన గంగం సంతోష్ (35), అతని తల్లి పద్మగా పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఆత్మహత్య పాల్పడే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. లాడ్జీలో పోలీసులు ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని డిఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ నరేష్ పరిశీలించారు.

మోసపోవడంతోనే ఆత్మహత్య..
తల్లీకుమారుడు  ఆత్మహత్యకు వ్యాపార లావాదేవీల్లో విభేదాలు రావడం, తమను అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనస్తాపానికి లోనై సంతోష్, పద్మ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరి మరణానికి కారణం ఏడుగురు అని సూసైడ్ నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. వారి బాధను ఓ సెల్ఫీ వీడియో రూపంలో తీసుకోగా, అందుకు సంబంధించిన ఆడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమను ఎవరు మోసం చేశారు, వారి పేరు, వివరాలు, ఫోన్ నెంబర్లు, తమను ఎలా ఇబ్బంది పెట్టారన్నది కన్నీటి పర్యంతమవుతూ సెల్ఫీ వీడియోలో సంతోష్ రికార్డ్ చేశాడు. పోలీసులు ఈ దిశగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

ఆత్మహత్యకు కారణం వీరేనని సెల్ఫీ సూసైడ్ లో పేర్లు..

‘నా పేరు గంగం సంతోష్. తండ్రి పేరు అంజయ్య. తల్లి పద్మ. మొబైల్ 9030785231. మాది రామాయం పేట. ఇది మా మరణ వాంగ్మూలం. పల్లె జితేందర్ గౌడ్. ఈయన రామాయంపేట మున్సిపల్ చైర్మన్. రెండో వ్యక్తి ఐరేని ప్రుథ్వీరాజ్ అలియాస్ బాలు. తండ్రి మురళీధర్ గౌడ్. మూడో వ్యక్తి యాదగిరి. తండ్రి వెంకటరామయ్య. రామాయంపేట మార్కెట్ చైర్మన్. నాలుగో వ్యక్తి తోట కిరణ్ తండ్రి కిషన్. ఐదో వ్యక్తి కన్నాపురం క్రిష్ణగౌడ్. ఆరో వ్యక్తి సరప్ స్వరాజ్ తండ్రి యాదగిరి. ఏడో వ్యక్తి తాండూరి నాగార్జున గౌడ్. ఈయన ప్రాపర్ గాంధారి. రామాయంపేట మాజీ సీఐగా చేశారు. ప్రస్తుతం తుంగతుర్తి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు’ అని బాధితుడు సంతోష్ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు.

Also Read: Tirupati Crime : అద్దె ఇంట్లో గుట్కా డెన్, వ్యాపారిలా వెళ్లి పట్టేసినా సెబ్ అధికారులు 

గతంలో బాసం శ్రీనుతో కలిసి సంతోష్ వ్యాపారం ప్రారంభించాడు. ఆ సమయంలో శ్రీను వద్ద డబ్బులు లేకపోవడంతో జితేందర్ గౌడ్ వద్ద అప్పు తీసుకున్నారు. మేం చేస్తున్న వ్యాపారం లాభాల బాట పట్టడంతో జితేందర్ గౌడ్ ఎంటరయ్యారని, వ్యాపారంలో 50 శాతం వాటా కావాలని డిమాండ్ చేయడంతో వీలు కాదని సంతోష్ చెప్పాడు. అయితే వ్యాపారం పూర్తయ్యాక గుడ్ వీల్ ఇస్తానని, చెబితే లేదు ఇప్పుడే కావాలని, పెద్ద మొత్తంలో నగదు కావాలని డిమాండ్ చేసి వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించారు. అప్పటి సీఐ నాగార్జున్ గౌడ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని సంతోష్ ఫోన్ తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 వరకు పీఎస్‌లోనే ఉంచుకుని లేనిపోని కేసులలో ఇరికించే ప్రయత్నం చేసే యత్నం జరిగిందన్నాడు. 

దీనిపై మరుసటి రోజు మెదక్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫేస్ బుక్ సంబంధిత కేసులో నాకు సంబంధం లేదని చెబుతూ ఫోన్ తిరిగి ఇచ్చేశాడు సీఐ. కానీ తన ఫోన్‌లో ఉన్న మొత్తం సమాచారాన్ని సీఐ నాగార్జున గౌడ్.. జితేందర్ గౌడ్‌కు ఇచ్చారని సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. తనపై బెదిరింపులు జరుగుతున్న విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా న్యాయం జరగలేదన్నారు. మొబైల్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని అడ్డం పెట్టుకుని మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఏడాదికి రూ.1 లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయపన్ను కట్టేవాడినని, కానీ వేధింపులు మొదలయ్యాక ఆర్థిక నష్టాలు మొదలయ్యాయని స్పష్టం చేశారు. అప్పులు చేశాను. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. ఆర్థిక నష్టాలు పూడ్చుకోగలను, కానీ నాతో పాటు కుటుంబాన్ని మానసికంగా కుంగిపోయేలా చేయడంతో పాటు స్నేహితుడు బాసం శ్రీనివాస్ నన్ను మోసం చేయడంతో తట్టుకోలేక ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నామని సెల్ఫీ సూసైడ్ వీడియోలో సంతోష్‌ వివరించారు.

Also Read: Crime News: టీతోపాటు టిఫిన్ ఇవ్వలేదని కోడలిపై మామ కాల్పులు 

Tags: telangana Crime News Kamareddy Mother Son Suicide Kamareddy Police

సంబంధిత కథనాలు

Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం

Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం

Satya Sai Trust: సత్యసాయి జిల్లాలో కబ్జాల పర్వం- ఉజ్వల్‌ ఫౌండేషన్ అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ

Satya Sai Trust: సత్యసాయి జిల్లాలో కబ్జాల పర్వం- ఉజ్వల్‌ ఫౌండేషన్ అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ

Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు

Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు

Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !

Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !

Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?

Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam

Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'

Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'

Breaking News Live Updates: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన

Breaking News Live Updates: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన

PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం

PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం