News
News
వీడియోలు ఆటలు
X

Crime News: టీతోపాటు టిఫిన్ ఇవ్వలేదని కోడలిపై మామ కాల్పులు

42 ఏళ్ల మహిళ తుపాకీ గాయాలతో ఆసుపత్రిలో చేరింది. విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్యులు షాక్ తిన్నారు.

FOLLOW US: 
Share:

మహారాష్ట్రలోని థానేలో ఘోరం జరిగింది. టీతోపాటు టిఫిన్ ఇవ్వలేదని కోడలితో మామ గొడవ పడ్డాడు. అది కాస్త శ్రుతి మించిందిపోయింది. కోపాన్ని ఆపుకోలేకపోయిన అతను తన తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. 

మామ జరిపిన కాల్పుల్ల కోడలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 
థానే సిటీలో కాశీనాథ్‌ పాండురంగ్‌ పాటిల్‌ అనే 76 ఏళ్ల వ్యక్తి కుమారుడి ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. ఎప్పటిలాగానే గురువారం ఉదయం 11.30 నిమిషాలకు  కోడలు టీ తీసుకొచ్చి ఇచ్చింది. దాన్ని చూసిన కాశీనాథ్‌ ... టిఫిన్ ఏదని అడిగాడు. రెడీ అవుతుందని చెప్పింది. 
ఆమె సమాధానం విన్న పెద్దాయనకు కోపం కట్టలు తెంచుకుంది. టీ, కాఫీ రెండూ తీసుకొచ్చి ఇవ్వడం తెలియదా అంటూ గొడవపడ్డాడు. 

ఇద్దరి మధ్య వాగ్వాదం నడుస్తుండగానే తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు కాశీనాథ్‌ పాండరంగ్‌ పాటిల్.  దీంతో బుల్లెట్‌ కోడలి పొట్టలోకి దూసుకెళ్లాయి. దీన్ని చూసిన ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా షాక్ అయ్యారు. 

గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 

కోడలిపై గన్‌తో కాల్పులు జరిగిన కాశీనాత్‌ పాండురంగ్‌ పాటిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం) 506(నేరపూరిత బెదిరింపు) కింద కేసులు రిజిస్టర్ చేశారు.
ఈ ఘటనపై రెండో కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మామను ఇంకా అరెస్టు చేయలేదు. 

Published at : 15 Apr 2022 01:32 PM (IST) Tags: Crime News Firing IPC 307 IPC 506 Thane News

సంబంధిత కథనాలు

Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు

Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు

దోసలు వేసినంత ఈజీగా చోరీలు - పట్టుకున్న పిగన్నవరం పోలీసులు

దోసలు వేసినంత ఈజీగా చోరీలు - పట్టుకున్న పిగన్నవరం పోలీసులు

Dead Body In Manhole: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేసిన పూజారి- హైదరాబాద్‌లో దారుణం

Dead Body In Manhole: ప్రియురాలిని హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేసిన పూజారి- హైదరాబాద్‌లో దారుణం

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

France stabbing: ప్రీస్కూల్‌లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు

France stabbing: ప్రీస్కూల్‌లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు

టాప్ స్టోరీస్

Revant Reddy : సెప్టెంబర్ 17న మేనిఫెస్టో - ఖచ్చితంగా ధరణి రద్దు - రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revant Reddy :  సెప్టెంబర్ 17న మేనిఫెస్టో - ఖచ్చితంగా ధరణి రద్దు - రేవంత్ కీలక వ్యాఖ్యలు

2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్

2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్, RSS సలహాతో బ్రహ్మాస్త్రం సిద్ధం చేసిన హైకమాండ్

WTC Final 2023: అజింక్య అదుర్స్‌! WTC ఫైనల్లో హాఫ్‌ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!

WTC Final 2023: అజింక్య అదుర్స్‌! WTC ఫైనల్లో హాఫ్‌ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు!

Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి

Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి