Kamareddy Crime : అప్పు తీర్చమన్నందుకు అత్యాచారం, బైక్ పై లిప్ట్ ఇచ్చి మార్గమధ్యలో దారుణం!
Kamareddy Crime News : కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పు తీర్చమన్నందుకు ఓ వ్యక్తి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Kamareddy Crime News : ఖమ్మం జిల్లా(Khammam District)లో కారులో లిఫ్టు ఇస్తానని చెప్పి తోటి ఉపాధ్యాయురాలిపై ఓ కీచక టీచర్(Teacher) ఘాతుకానికి పాల్పడిన ఘటన మరువక ముందే.. కామారెడ్డి జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లా బీబీపేట(Bibipet) మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అత్యాచారం చేశాడో మృగాడు. ఆపై మహిళను చంపడానికి ప్రయత్నించాడు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక పోలీసుల సమాచారం మేరకు జనగామ గ్రామానికి చెందిన గణేశ్‌కు బాధిత మహిళ గతంలో అప్పు ఇచ్చింది. అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు గణేశ్ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
లిఫ్ట్ ఇచ్చి మార్గమధ్యలో దారుణం
మహిళ సిద్దిపేట జిల్లా(Siddipet) భూంపల్లి దగ్గర నుంచి బీబీపేటకు రావడానికి బస్టాండ్‌లో ఎదురుచూస్తుంది. మహిళను గమనించిన గణేశ్ తన బైక్‌పై తీసుకు వెళ్తానని నమ్మబలికాడు. మార్గమధ్యలో బైక్ ఆపి మహిళను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత ఆమెను కొట్టి బంగారు నగలు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు బంధువుల సాయంతో ఇంటికి చేరుకుంది. అనంతరం ఆమెను బంధువులు ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తోటి టీచర్ పై అఘాయిత్యం
ఖమ్మంలో నివాసముంటున్న బానోత్ కిషోర్ అనే ఉపాధ్యాయుడు మహాబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పని చేస్తున్నాడు. ఇతని భార్య కూడా ఉపాధ్యాయురాలే. ఈమె కూడా డోర్నకల్ సమీపంలోనే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. భార్య భర్తలు ఇద్దరూ రోజూ కారులో పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. ఖమ్మంలో నివసించే మరో ఉపాధ్యాయురాలు డోర్నకల్ మండలంలో టీచర్‌గా పనిచేస్తుంది. ఈమె ప్రతిరోజు డోర్నకల్ వరకు రైలులో వెళ్లి అక్కడ్నుంచి తన ద్విచక్రవాహనంపై పాఠశాలకు హాజరవుతుంటుంది.
ఎప్పట్నుంచో కన్నేసిన కీచక టీచర్..
డోర్నకల్‌లో పనిచేసే ఉపాధ్యాయురాలిపై ఎప్పట్నుంచో కన్నేసిన కీచక టీచర్ ఆమెను అనుభవించాలని కోరికను పెంచుకున్నాడు. అదను కోసం వేచి చూశాడు. ఇటీవల పాఠశాలకు ఒక పూట బడులు ప్రారంభం కావడం, ఓ రోజు తన భార్య పాఠశాలకు రాకపోవడంతో ఎలాగైనా డోర్నకల్‌లో పనిచేసే టీచర్‌ను అనుభవించాలని నిశ్చయించుకున్నాడు. పాఠశాల విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేందుకు డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న టీచర్ వద్దకు వెళ్లాడు. తన భార్య కూడా ఉందని ముగ్గురం కలిసి ఖమ్మంకు కారులో వెళదామని నమ్మించాడు. అతని మాయమాటలకు నమ్మిన టీచర్ కీచకుడి భార్య కూడా ఉందని నమ్మి కారు ఎక్కింది. ఇదే అదనుగా భావించిన కీచక టీచర్ ఖమ్మం పాండురంగాపురంలోని ఓ ఇంటికి బాధితురాలిని తీసుకెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.