అన్వేషించండి

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

Kakinanda News : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ మిస్టరీ వీడింది. ఎమ్మెల్సీ అనంతబాబుకు ఇగో హర్ట్ అయి నెట్టడంతో తలకు గాయమై డ్రైవర్ చనిపోయాడని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు.

Kakinanda News : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రాథమికంగా నిందితుడిగా తేల్చామని కాకినాడ ఎస్పీ రవీంద్ర నాథ్ మీడియాకు తెలిపారు. ఈ కేసు వివరాలను తెలిపిన ఎస్పీ... కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు ఎమ్మెల్సీపై 302 , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కింద కేసు నమోదు చేశామన్నారు. 19న ఘటన జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడంలో కొంత ఆలస్యం జరిగిందని, బాధితుడి తల్లి ఫిర్యాదుతో వెంటనే కేసు నమోదు చేశామన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు కోసం ఆరు బృందాలతో గాలించామన్నారు. ఈ కేసులో అన్ని వివరాలు సేకరిస్తూ, ఎమ్మెల్సీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఇవాళ మార్నింగ్ ఎమ్మెల్సీని కస్టడీలోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. కస్టడీలో పూర్తిగా విచారణ చేశామన్నారు.  విచారణలో ప్రాథమికంగా ఎమ్మెల్సీని నిందితుడిగా గుర్తించామన్నారు. విచారణ అనంతరం కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. 

కేసు వివరాలు ఇలా 

'ఈ నెల 19న సుబ్రహ్మణ్యం 8 గంటల ఇంట్లోంచి బయటకు వచ్చాడు. లిక్కర్ కొనుక్కొని శ్రీరాంనగర్ ప్రాంతంలో స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. రోడ్డుపైకి వచ్చినప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఆ మార్గంలో వెళ్లూ వీళ్లను చూసి ఆగారు. ఎమ్మెల్సీ పిలవడంతో సుబ్రహ్మణ్యం ఆ కారులో ఎక్కాడు. ఆ రోడ్డులో అలా ముందుకు వెళ్లాడు. జన్మభూమి పార్కు ఏరియాలో టిఫిన్ తీసుకుని అక్కడ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు ఇంటికి వెళ్లారు. సుబ్రహ్మణ్యం పెళ్లి సమయంలో అనంతబాబు కొంత డబ్బులు ఇచ్చారు. అవి తిరిగి ఇవ్వలేదన్న దానిపై కొంత చర్చ జరిగింది. ప్రవర్తన మార్చుకుంటే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోమని మీ అమ్మ కోరింది. కానీ నవ్వు పవర్తన మార్చుకోలేదని ఎమ్మెల్సీ.. సుబ్రహ్మణ్యంతో అన్నారు. ప్రవర్తన మార్చుకోలేదన్న విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది.  సుబ్రహ్మణ్యాన్ని కొట్టడానికి ఎమ్మెల్సీ ముందుకు వెళ్లారు. లిక్కర్ సేవించి ఉండడంతో సుబ్రహ్మణ్యం కూడా తిరగబడ్డాడు. ఎదురుతిరిగి మాట్లాడడంతో ఎమ్మెల్సీ ఇగో హర్ట్ అయి సుబ్రహ్మణ్యం మెడపట్టుకుని నెట్టాడు. అపార్ట్ మెంట్ దగ్గర గట్టుపై డ్రైవర్ పడిపోయాడు. తలపై గాయం అయింది. దీంతో సుబ్రహ్మణ్యం మళ్లీ తిరగబడ్డాడు. అప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం మెడపట్టుకుని నెట్టడంతో తలకు తీవ్రగాయం అయింది. సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కారులో తీసుకెళ్తుండడంతో ఎక్కిళ్లు వచ్చినప్పుడు నీళ్లు ఇచ్చాడు. అప్పటికే సుబ్రహ్మణ్యం  చనిపోయాడు' అని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు.  

కర్రతో కొట్టి గాయాలు

'సుబ్రహ్మణ్యం మద్యం సేవించినప్పుడల్లా యాక్సిడెంట్స్ చేస్తాడని, అలా నమ్మించేందుకు ఎమ్మెల్సీ అనంతబాబు ప్రయత్నించాడు. అందుకే సుబ్రహ్మణ్యం శరీరంపై కర్రతో కొట్టి గాయాలు చేశాడు. బాడీపై గాయాలు చేసి కారులో ఎక్కించుకుని తల్లిదండ్రులు ఫోన్ చేశాడు. బైక్ ప్రమాదం జరిగిందని మృతుడి తల్లిదండ్రులకు చెప్పాడు. మళ్లీ ఫోన్ చేసి ఆసుపత్రికి జాయిన్ చేశామని చెప్పి, చివరకు చనిపోయాడని చెప్పి బాడీని తల్లిదండ్రులకు అప్పగించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు' అని ఎస్పీ తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Best Budget CNG Cars: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Embed widget