అన్వేషించండి

Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?

Crime Investigation: తాళం వేసి ఉన్న ఇల్లును గుల్లచేద్దామని ఇద్దరు దొంగలు లోపలికి దూరారు.కానీ వారు అటు వెళ్లగానే ఇటు పోలీసుల్ని పిలిచారు కాలనీ వాసులు.

Kagaznagar Police:  అర్థరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లలోకి దూరి, చేతికి దొరికిన కాడికి నొక్కేద్దామని ప్లాన్ వేసిన ఆ ఇద్దరు ఘరానా దొంగల స్కెచ్ రివర్స్ అయింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని మారుతీనగర్‌లో అర్ధరాత్రి ఇద్దరు కేటుగాళ్లు భారీ చోరీ కోసం ఒక ఇంట్లోకి చొరబడ్డారు. అంతా బాగానే ఉంది అనుకునే లోపే.. సీన్ కాస్త అడ్డం తిరిగింది.  ఇంట్లో వాళ్లు నిద్రపోతున్నారులే అని వీరు హ్యాపీగా పని కానిచ్చేస్తున్న తరుణంలో, కాలనీ స్థానికులు ఊహించని షాక్ ఇచ్చారు. దొంగల కదలికలను గమనించి ఒక్కసారిగా అప్రమత్తమైన స్థానికులు.. సినిమా ఫైట్ సీన్ తరహాలో దొంగలను చుట్టుముట్టారు. 

 దోస్తీ అంటే ఇదేరా.. చేతులు కట్టేసిన జనం! 

సరిగ్గా జనం ఎంట్రీ ఇచ్చేసరికి ఇద్దరు దొంగల్లో ఒకడికి అదృష్టం, మరోకడికి బ్యాడ్ లక్ కలిసి వచ్చింది. కాలనీ వాళ్లు పట్టుకోవడానికి పరిగెత్తడంతో.. ఒక దొంగ తన దోస్తీ ని, పార్ట్‌నర్‌ను నడిరోడ్డుపై గాలికొదిలేసి, ఒంటికాలిపై అక్కడి నుంచి చీకట్లోకి జంప్ అయ్యాడు. ఇక మిగిలిన రెండో దొంగ ఒంటరిగా దొరికిపోవడంతో స్థానికులు అతనికి చుక్కలు చూపించారు. పారిపోయే ఛాన్స్ ఇవ్వకుండా ఆ దొంగ చేతులు వెనక్కి విరిచి గట్టిగా తాడుతో కట్టేసి, కాగజ్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. దొంగతనం చేసి దర్జాగా వెళ్దామనుకున్న సదరు కేటుగాడు.. చివరకు చేతులు కట్టేసి నడిరోడ్డుపై కూర్చోబెట్టేసరికి బిక్కమొహం వేశాడు.
   
 పోలీసుల ఎంట్రీ.. పట్టుబడ్డ కేటుగాడి ఊరేగింపు! 

సమాచారం అందిన వెంటనే కాగజ్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల బంధీలో ఉన్న దొంగను తమ ఆధీనంలోకి తీసుకుని, జీపులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లోకల్ ఏరియాలో దొంగ దొరకడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడ్డ సదరు కేటుగాడిని గట్టిగా  పోలీస్ స్టైల్ విచారణ  పెడితే.. పారిపోయిన రెండో దొంగ అడ్రస్, అసలు వీరు ఏ గ్యాంగ్‌కు చెందినవారనే గుట్టు మొత్తం విప్పుతాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పారిపోయిన ఆ రెండో    దొంగ కోసం పోలీసులు కాగజ్‌నగర్ అంతటా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
 
 కాగజ్‌నగర్‌లో కలకలం.. తాళం వేస్తే జాగ్రత్త! 

ఈ అర్ధరాత్రి దొంగల హల్‌చల్ ఘటనతో కాగజ్‌నగర్ పట్టణ ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇళ్లలోకి ఇలా చొరబడి దొంగతనాలకు యత్నిస్తుండటంతో రాత్రి పూట నిద్రపోవాలన్నా జనాలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఆదిలాబాద్ లోకల్ మీడియా, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేటప్పుడు పొరుగువారికి సమాచారం ఇవ్వాలని, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 కి సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

కేసు నమోదు 

ప్రస్తుతం కాగజ్‌నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పట్టుబడిన దొంగ గతంలో ఎక్కడైనా ఇటువంటి చోరీలకు పాల్పడ్డాడా? అనే కోణంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా, తోటి దొంగను నడిబజార్లో వదిలేసి పరారైన ఆ రెండో దొంగ కోసం పోలీసులు వేట సాగిస్తుండటంతో.. త్వరలోనే ఈ  చోర్ గ్యాంగ్  ఆట కట్టవడం ఖాయమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget