Pune Rash Driving: 'ప్రమాదంపై వ్యాసం రాయాలి, ట్రాఫిక్ పోలీసులతో పనిచేయాలి' - పుణె ర్యాష్ డ్రైవింగ్ కేసులో మైనర్‌కు బెయిల్ కండిషన్లు
Pune News: పుణేలో ర్యాష్ డ్రైవింగ్‌తో ఇద్దరి మృతికి కారణమైన మైనర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ కింద కొన్ని షరతులు విధించింది. అటు, మైనర్ తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది.
Court Grant Bail To Minor In Pune Rash Driving Case: మహారాష్ట్రలోని పుణేలో ఓ లగ్జరీ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరి మృతికి కారణమైన మైనర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ కింద కొన్ని షరతులు విధించగా అవి చర్చనీయంగా మారాయి. ప్రమాదంపై వ్యాసం రాయాలని.. 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పాటు కలిసి పని చేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని.. భవిష్యత్తులో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే వారికి సాయం చేయాలని సూచించింది. అయితే, నిందితుడిని మేజర్‌గా పరిగణించి విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. తమ అభ్యర్థనను పరిగణించాల్సిందిగా సెషన్ కోర్టును ఆశ్రయిస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా, బెయిల్ షరతులను తప్పకుండా పాటించేలా చర్యలు చేపడతామని అన్నారు. ఘటనకు కారణమైన బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ జరిగింది
పుణేలో ఆదివారం తెల్లవారుజామున పోర్షీ కార్ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చి బైక్ ను ఢీకొట్టగా.. ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో పుణేలోని కల్యాణి నగర్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ క్లబ్‌కి వెళ్లిన ఇద్దరి స్నేహితులు బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా.. పోర్షీ కార్ వేగంగా వచ్చి వాళ్లని ఢీకొట్టింది. ఈ ధాటికి ఇద్దరూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి వేరే కార్‌పై పడిపోయారు. స్పాట్‌లోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా షాకైన స్థానికులు కారు నడుపుతున్న మైనర్ ను బయటకు లాగి.. రోడ్డుపై ఈడ్చుకుంటూ దారుణంగా కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Pune Boy rammed many vehicles with his speeding Porsche, killing two people. pic.twitter.com/XMdpocUKfC
— sarthak (@sarthaktya31022) May 19, 2024
'పబ్ లో సంబరాలు'
ప్రమాద సమయంలో మైనర్ 200 కి.మీల వేగంతో కారు నడిపి బైక్ ను ఢీకొట్టినట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. '12వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత మైనర్ స్థానిక పబ్ లో సంబరాలు చేసుకున్నాడు. కారు ప్రమాదానికి ముందు అతను మద్యం సేవించి ఉన్నాడు. మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం తాగేందుకు చట్టపరమైన అనుమతి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా మైనర్ కు మద్యం ఇచ్చిన బార్ ఓనర్ పై చర్యలు తీసుకుంటాం.' అని పుణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.
నెట్టింట విమర్శలు
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇద్దరి ప్రాణాలు బలిగొన్న మైనర్ కు 15 గంటల్లోనే బెయిల్ రావడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో సదరు మైనర్ పబ్ లో ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అతను స్నేహితులతో మద్యం తాగుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అయితే, ఆల్కహాల్ టెస్ట్ రిజల్ట్ లో నెగిటివ్ గా వచ్చిందని తెలుస్తోంది. మైనర్ ను పబ్ లోకి ఎలా అనుమతించారని.. కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | Maharashtra: Visuals of the Porsche car and bike currently at Yerwada Police Station in Pune.
— ANI (@ANI) May 21, 2024
Two people were killed when a speeding Porsche car hit them from behind on 19th May. The accused has been granted bail by the Juvenile Justice Board and his father was… https://t.co/HKj8uK4d9q pic.twitter.com/91SeqwfTeN