Crime News: ప్రైవేట్ కళాశాల ఏవోపై ఇంటర్ విద్యార్థి హత్యాయత్నం - కత్తితో గొంతులో పొడిచాడు, తిరుపతి జిల్లాలో దారుణం
Tirupati News: తిరుపతిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఏవో ఆదివారం రాత్రి ఓ ఇంటర్ విద్యార్థి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బ్యాగులు తనిఖీ చేస్తుండగా.. కత్తితో గొంతులో పొడిచాడు.

Inter Student Murder Attempt On Chaitanya College AO In Tirupati: తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కళాశాల ఏవోపై ఇంటర్ విద్యార్థి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బ్యాగులు తనిఖీ చేస్తుండగా కత్తితో గొంతులో పొడిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా (Tirupati District) తిరుచానూరు వసుందర నగర్‌లో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ క్యాంపస్ ఏవో వెంకటరమణపై అదే కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ చదువుతోన్న విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఆదివారం రాత్రి అనుమానం వచ్చి ఏవో.. బ్యాగులు తనిఖీ చేస్తుండగా సదరు విద్యార్థి కత్తితో ఆయన గొంతులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఏవోను సహచర సిబ్బంది వెంటనే తిరుపతి రుయాకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కాలేజీకి చేరుకుని విచారణ చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

