Indian family: అమెరికా సరిహద్దుల్లో భారత కుటుంబం దుర్మరణం.. చలికి గడ్డకట్టుకుపోయి..!
అమెరికా సరిహద్దుల్లో మంచు తుపాను కారణంగా చలికి గడ్డ కట్టుకుని నలుగురు భారతీయులు మృతి చెందారు.
అమెరికా- కెనడా సరిహద్దులో దారుణ ఘటన జరిగింది. తీవ్రమైన మంచు తుపాను కారణంగా చలికి గడ్డకట్టుకుని ఓ చిన్నారి సహా నలుగురు భారతీయులు మృతి చెందారు. ఈ ఘటన జనవరి 19న జరిగ్గా మృతులను తాజాగా గుర్తించారు.
వీరు గుజరాత్‌కు చెందిన జగదీశ్ బల్‌దేవ్‌భాయ్ పటేల్ (39), ఆయన భార్య వైశాలిబెన్ (37), కుమార్తె విహంగి జగదీశ్ కుమార్ పటేల్ (11), కుమారుడు ధార్మిక్ జగదీశ్ కుమార్ పటేల్ (3)గా అధికారులు ప్రకటించారు.
దారుణమైన స్థితిలో..
జనవరి 19న అమెరికా- కెనడా సరిహద్దుకు కొంత దూరంలో కెనడా వైపు నాలుగు మృతదేహాలను కనుగొన్నట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు.. యూఎస్ బోర్డర్ పెట్రోల్ అధికారులకు సమాచారమిచ్చారు. సరిహద్దుకు 12 మీటర్ల దూరంలో మంచులో కూరుకుపోయి అత్యంత దారుణమైన స్థితిలో ఈ మృతదేహాలు కనిపించాయి.
అధికారులు వెంటనే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. విపరీతమైన మంచు కారణంగా గడ్డకట్టుకుపోయి వీరంతా చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆ తర్వాత దర్యాప్తు చేపట్టగా చనిపోయినవారు భారత్‌కు చెందిన పటేల్ కుటుంబంగా గుర్తించారు. సరిహద్దుకు చేరుకునే ముందు కొద్ది రోజులు వీరంతా కెనడాలోని పలు ప్రాంతాల్లో కనిపించినట్లు దర్యాప్తులో తేలింది.
అక్రమ రవాణా..
పటేల్ కుటుంబం జనవరి 12న టొరంటో చేరుకుందని, అక్కడి నుంచి జనవరి 18న సరిహద్దుకు బయల్దేరిందని కెనడా పోలీసులు ధ్రువీకరించారు. దీని వెనుక మానవ అక్రమ రవాణా ముఠా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు.
The Identities of four victims, whose bodies were recovered near the Canada-US border in Manitoba on 19 January 2022, have now been confirmed.@MEAIndia @IndiainToronto @rcmpmb pic.twitter.com/ptwj2ER0Uf
— India in Canada (@HCI_Ottawa) January 28, 2022
పటేల్ కుటుంబం మృతిని కెనడాలోని భారత హైకమిషన్ కూడా ధ్రువీకరించింది. మృతులు బంధువులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
Also Read: PM Narendra Modi: ట్రెండ్ మార్చిన మోదీ.. ఈసారి నల్ల కళ్లద్దాలు, తలపాగా.. పంజాబ్ కోసమే!