అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Jaipur - Mumbai Train Firing: ఇండియాలో ఉండాలంటే మోదీ, యోగీకి ఓటు వేయాల్సిందే- ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వీడియో వైరల్ !

జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పుల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పుల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైలులో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్ చేతన్ సింగ్ చేతిలో ఆర్పీఎఫ్‌ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ తికారాం మీనాతో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఆసక్తికర, సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
ఆ వీడియోలో.. కానిస్టేబుల్ చేతన్ సింగ్ తన చేతిలో తుపాకీతో ప్రయాణికులను బెదిరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక ప్రయాణికుడి మృతదేహం కూడా అతని పాదాల దగ్గర రక్తపు మడుగులో పడి ఉంది. తాను హత్య చేసిన వ్యక్తులకు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయని సింగ్ చెప్పినట్లు వినిపిస్తోంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీడియా కూడా అదే చెబుతుందని, ఎవరైనా జీవించాలనుకునే వారు ‘మోదీ, యోగి’లకు మాత్రమే ఓటు వేయాలని బెదిరింపులకు దిగాడు.

డ్యూటీ నుంచి రిలీవ్ చేయలేదని..
ప్రభుత్వ రైల్వే పోలీసు (జిఆర్‌పి) కమిషనర్ రవీంద్ర షిస్వే వివరాల మేరకు.. చేతన్‌ సింగ్‌ను ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) సిబ్బంది పట్టుకున్నారు. మరణించిన ప్రయాణికులను అబ్దుల్ ఖాదిర్‌భాయ్ మహమ్మద్ హుస్సేన్ భన్‌పూర్వాలా (48), అక్తర్ అబ్బాస్ అలీ (48), సదర్ మహ్మద్ హుస్సేన్‌లుగా గుర్తించారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఎస్కార్ట్ పార్టీలో భాగమైన ప్రయాణికులు, RPF సిబ్బంది, ప్యాంట్రీ కారు సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. FIR వివరాల ప్రకారం.. నిందితుడు కానిస్టేబుల్ చేతన్ సింగ్ తన షిఫ్ట్ ముగియడానికి కొన్ని గంటల ముందు డ్యూటీ నుంచి రిలీవ్ కావాలని కోరాడు. కానీ అతని సీనియర్లు డ్యూటీ పూర్తి చేయాలని సూచించడంతో అతనికి ఆవేశం వచ్చింది. దీంతో తన సీనియర్ అధికారి మీనాతో పాటు రైలులో మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడు. 

సీనియర్లు చెబుతున్నా వినకుండా
మరో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అమయ్ ఆచార్య బోరివలి వివరాల మేరకు ‘సోమవారం తెల్లవారుజామున సింగ్, మీనా, మరో ముగ్గురు టిక్కెట్ చెక్కర్లు ప్యాంట్రీ కోచ్‌లో నన్ను కలిశారు. సింగ్ అస్వస్థతతో ఉన్నాడని మీనా తనకు చెప్పారని, ఆ తర్వాత తాను చేతన్ సింగ్ చేతిని పరీక్షిస్తే  జ్వరం ఉందో లేదో నేను అంచనా వేయలేకపోయానని చెప్పారు. ఈ నేపథ్యంలో చేతన్ సింగ్ డ్యూటీ నుంచి త్వరగా రిలీవ్ కావాలని, వల్సాద్ రైల్వే స్టేషన్‌లో దింపాలని సింగ్ పట్టుబట్టాడు. అయితే రెండు మూడు గంటల్లో ముంబై చేరుకుంటామని మీనా అతనికి వివరించేందుకు ప్రయత్నించారు. సింగ్ అందుకు అంగీకరించకపోవడంతో మీనా ముంబై సెంట్రల్ కంట్రోల్ రూమ్‌కి తెలియశారు. అతన్ని ఒప్పించమని కోరింది. అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సుజిత్ కుమార్‌ సైతం నచ్చచెప్పే ప్రయత్నం చేసినా సింగ్ వినడానికి సిద్ధంగా లేడు. కూల్ డ్రింక్ తాగమని, కొంత సమయం విశ్రాంతి తీసుకోమని సింగ్‌కు మీనా సూచించారు. 

మరుగుదొడ్లో దాక్కున్న కానిస్టేబుల్
విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సింగ్ అకస్మాత్తుగా లేచి ఆచార్య రైఫిల్‌ను బలవంతంగా తీసుకున్నాడు. అడ్డుకున్న ఆచార్యను గొంతు కోసి చంపడానికి కూడా ప్రయత్నించాడు. కొద్ది సేపటికి  రైఫిల్‌ని తిరిగి ఇచ్చాడు. ఆ సమయంలో సింగ్ చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు కూడా మీనా అతనికి వివరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆచార్య సైతం అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించినా వారి మాట వినలేదు. దీంతో ఆచార్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో చేతన్ తన రైఫిల్ సేఫ్టీ క్యాచ్‌ను తొలగిస్తున్నట్లు గమనించాడు. వెంటనే మీనాకు సమాచారం ఇచ్చాడు. అయితే తెల్లవారుజామున 5 గంటలకు ఆచార్యకు అతని బ్యాచ్‌మేట్ నుంచి కాల్ వచ్చింది. మీనాను చేతన్ సింగ్ కాల్చాడని చెప్పాడు. దీంతో తనను చంపేస్తాడనే భయంతో ఆచార్య వాష్‌రూమ్‌లో దాక్కున్నాడు. 

ఇక ఘటనలో చనిపోయిన మీనాకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు పశ్చిమ రైల్వే సీనియర్ అధికారి తెలిపారు. తక్షణం  అంత్యక్రియల ఖర్చు రూ. 20,000 అందిస్తామని, రైల్వే సురక్ష కళ్యాణ్ నిధి నుంచి అదనంగా రూ. 15 లక్షలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget