By: ABP Desam | Updated at : 02 Mar 2022 03:02 PM (IST)
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు
Nampalli: హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కావడం కలకలం రేపింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బిడ్డను ఎత్తుకుపోయింది ఓ అనుమానిత మహిళ అని పోలీసులు గుర్తించారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితురాలి కోసం గాలించేందుకు రోడ్డుపైకి వచ్చారు. మొత్తానికి గంటల వ్యవధిలోనే కిడ్నాప్‌కు గురైన బాలిక, కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించారు. చిన్నారిని కాపాడి తల్లికి అప్పగించారు.
అత్తాపూర్ కల్లు కాంపౌండ్ దగ్గర చిన్నారిని పోలీసులు రక్షించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ అయిన నాలుగు గంటల్లోనే ఈ కేసును పోలీసులు చేధించారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు పోలీసులు ప్రకటించారు.
బుధవారం ఉదయం నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నీలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా అనుమానిత మహిళను గుర్తించారు. పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు గంటల్లోనే చేధించారు.
Also Read: Kagaznagar Attack: 8 నెలల గర్భిణీ ఫారెస్ట్ ఆఫీసర్‌పై కర్రలతో దాడి, రక్షణ కోసం పరిగెత్తుతూ ఘోరం
ఇద్దరు చిన్నారులు మృతి
మరోవైపు, ఇదే నీలోఫర్ ఆస్పత్రిలో ఇంజక్షన్‌లు వికటించి ఇద్దరు పసి పిల్లలు ప్రాణాలు వదిలారు. ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. తమ పిల్లలు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం ఆసుపత్రి సిబ్బంది అని ఆరోపిస్తున్నారు. డాక్టర్లు, నర్సులు కాకుండా ఆస్పత్రిలో పనిచేసే ఆయాలు ఇంజెక్షన్లు చేస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపించారు. నర్సులు కాకుండా ఆయాలు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల తమ పిల్లలు క్షణాల్లోనే చనిపోయారని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ఎదుట చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిలోఫర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే, ఈ విషయంపై నిలోఫర్ డాక్టర్లు స్పందించారు. ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే చిన్నారుల ఆరోగ్యం విషమించిందని చెప్పుకొచ్చారు. హుటాహుటిన తాము వైద్యం చేసేందుకు యత్నించినా వారి ప్రాణాలు దక్కలేదని తెలిపారు.
Also Read: KCR In Delhi : కేసీఆర్ ఢిల్లీ పర్యటన జాతీయ రాజకీయాల కోసమా ? వ్యక్తిగత పర్యటనా ?
ప్రేమ పేరుతో నమ్మించి, రెండుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ - ప్రియుడిని నిలదీస్తే ఏమన్నాడంటే !
Hyderabad news : ప్రియుడితో భార్య రాసలీలలు, రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న భర్త
Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
Kondapalli Hidden Treasures : కొండపల్లి ఫారెస్ట్ లో గుప్త నిధులున్నట్లు ప్రచారం, తవ్వకాలు స్టార్ట్ చేసేసిన కేటుగాళ్లు
Bapatla Volunteer Murder : మహిళా వాలంటీర్ మర్డర్ కేసులో నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!