By: ABP Desam | Updated at : 02 Mar 2022 12:53 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad: సామాజిక మాధ్యమాల్లో యువతి యువకుడికి ఏర్పడిన పరిచయం చివరికి విషాదానికి దారి తీసింది. ఇన్ స్టా గ్రామ్ ద్వారా పరిచయం అయిన రెండు రోజులకే ఆమెపై ఓ యువకుడు, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం (Gang Rape) చేశారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్ (Rajendra Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ మహిళకు ఇన్ స్టా గ్రామ్‌లో రెండు రోజుల క్రితం ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు వాట్సప్‌లో కూడా ఛాటింగ్ చేసుకున్నారు. ఇది చివరికి సామూహిక అత్యాచారానికి దారి తీసింది.
రాజేంద్ర నగర్ (Rajendra Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సులేమాన్ నగర్‌లో సాజిత్ అనే 27 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఓ ప్రైవేటు ఉద్యోగి. అతడికి రెండు రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్‌లో సంతోష్ నగర్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఇన్ స్టా ఛాటింగ్ ద్వారా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు. ఛాటింగ్‌లో న్యూడ్‌గా కనిపించాలని కోరిన సాజీద్ అనే యువకుడు.. ఆ తర్వాత ఆ న్యూడ్ కాల్ మొత్తాన్ని రికార్డ్ చేశాడు. ఆ వీడియోతో యువతిని బ్లాక్ మెయిల్ చేసిన సాజీద్.. రాజేంద్రనగర్‌లోని తన స్నేహితుడి గదికి రావాలని బెదిరించాడు.
వీడియో ఎక్కడ బయట పడుతుందోనని సాజీద్ బ్లాక్ మెయిల్‌కు లొంగిపోయిన యువతి.. హుటాహుటిన సాజీద్ చెప్పిన అడ్రస్‌కు చేరుకుంది. దీంతో నిందితుడు రాజేంద్ర నగర్‌కు వచ్చిన మహిళను తన బైక్‌పై ఎక్కించుకొని సులేమాన్ నగర్‌లో నివసించే అతడి స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ యువతిపై అత్యాచారం చేశాడు. అంతేకాక, తన నలుగురు స్నేహితులు కూడా యువతిపై అత్యాచారం చేశారు.
ఈ క్రమంలోనే సీక్రెట్‌గా 100 నెంబరుకు యువతి ఫోన్ చేసింది. యువతి ఇచ్చిన సమాచారం మేరకు, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఘటన స్థలానికి చేరుకున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. గదిలో ఉన్న యువతిని కాపాడి.. అత్యాచారానికి పాల్పడ్డ సాజీద్‌తో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తనపై లైంగిక దాడికి పాల్పడటమేగాక హింసించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో ఐదుగురు నిందితులు అరెస్టు
Jeedimetla News : ఇంట్లో దాచిన రూ.4 లక్షలు ఇరవై రోజుల్లో ఖర్చుపెట్టేసిన పిల్లలు
Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్