Hyderabad: మేనల్లుడ్ని లైంగికంగా వాడుకున్న అత్త.. ఇంకొకరితో ఆ వీడియోలు తీయించి వాటితో..
వరుసకు మేనల్లుడు అయ్యే 14 ఏళ్ల బాలుడిని.. అత్త లైంగికంగా వాడుకోవడమే కాకుండా వీడియో రికార్డింగ్స్ బయటపెడతానంటూ బెదిరించి బంగారం, పెద్ద సంఖ్యలో డబ్బులు కాజేసింది.
నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కనీసం వావి వరసలు, బంధుత్వాలు మరిచి మరీ కొందరు ఆకృత్యాలకు పాల్పడడం విస్మయం కలిగిస్తోంది. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. 9వ తరగతి చదివే మేనల్లుడిని లైంగికంగా వాడుకోవడమే కాకుండా ఆ తతంగం మొత్తాన్ని వీడియో తీసి డబ్బుల కోసం బెదిరించిన తీరు సమాజాన్ని తలదించుకొనేలా చేస్తోంది. పూర్తి వివరాలివీ..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరుసకు మేనల్లుడు అయ్యే 14 ఏళ్ల బాలుడిని.. అత్త లైంగికంగా వాడుకోవడమే కాకుండా వీడియో రికార్డింగ్స్ బయటపెడతానంటూ బెదిరించి బంగారం, పెద్ద సంఖ్యలో డబ్బులు కాజేసింది. దీంతో మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టోలీచౌకిలోని సాలార్‌జంగ్ కాలనీలో 34 ఏళ్ల మహిళ నివాసం ఉంటోంది. తన కుటుంబంతో సహా 2 నెలల క్రితం గాయత్రీ హిల్స్‌కి మకాం మారింది. ఆ సమయంలో కొన్ని నగలు కనిపించకపోవడంతో అనుమాన పడ్డ ఆమె.. అనుమానంతో కొడుకు(14)ను గట్టిగా ప్రశ్నించింది. దీంతో బాలుడు చెప్పిన విషయంతో మొత్తం గుట్టంతా బయటకు వచ్చింది.
బెంగళూరులో ఉండే మేనత్త (33)కు ఆ నగలు మొత్తం ఇచ్చానని బాలుడు చెప్పాడు. ఎందుకు ఇచ్చావని తల్లి గట్టిగా ప్రశ్నించగా.. మొత్తం విషయాన్ని తల్లికి వివరించాడు. బెంగళూరు నుంచి అప్పుడప్పుడు మేనత్త హైదరాబాద్ వస్తుంటుందని, తనను నేరుగా తన స్కూల్‌కు వచ్చేదని వివరించాడు. చార్మినార్ ప్రాంతంలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లి తనపై లైంగిక దాడి చేసిందని చెప్పాడు. ఎన్నోసార్లు తన కోరిక తీర్చమని అడిగేదని వివరించాడు. ఆ మొత్తం వ్యవహారాన్ని ఇర్ఫాన్ అనే వ్యక్తి వీడియోలు తీశాడని వెల్లడించాడు.
ఆ వీడియోల ఆధారంగా వాటిని బయటపెడతామని ఇద్దరూ బెదిరించడంతో 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.6 లక్షల నగదు వారికి ఇచ్చానని బాలుడు తల్లికి వివరించాడు. దీంతో బాలుడి తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలు సహా మరో వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read : బుల్లెట్టు బండెక్కి వచ్చాడు.. సూసైడ్ లెటర్ రాసి పోయాడు.. ఇంతలోనే మతిపోగొట్టే ట్విస్ట్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి