అన్వేషించండి

Hyderabad: సూసైడ్ చేసుకోవాలనుకున్న వ్యక్తి, టెక్నాలజీ సాయంతో గంటలో కాపాడిన పోలీసులు

Hyderabad Police News: జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్‌ టెక్నాలజీ సహాయంతో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. మొబైల్‌ సిగ్నల్స్‌ను ట్రేస్‌ చేసి గంటలోనే కేసును ఛేదించారు.

Hyderabad Police saves a Man life: హైదరాబాద్ పోలీసుల మరో సారి వారి ఘనత చాటుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే వేగంగా స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలను గంటలోనే కాపాడారు. టెక్నాలజీ సాయంతో గంట వ్యవధిలోనే కేసును ఛేదించి వ్యక్తిని కాపాడగలిగారు. వివరాల్లోకి వెళితే..  హైదరాబాద్‌ (Hyderabad) జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బీరప్పనగర్‌కు చెందిన మాలంపాక బాబీ (28) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం తన బావమరిదికి ఫోన్ చేశాడు. తాను చనిపోతున్నానంటూ చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనకు తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి సంప్రదించినా ఆచూకీ లభించలేదు. ఇక చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

టెక్నాలజీ సాయంతో
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు.  జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్‌.. టెక్నాలజీ సహాయంతో బాబీ మొబైల్‌ సిగ్నల్స్‌ను ట్రేస్‌ చేశారు.  సికింద్రాబాద్‌ (Secunderabad)లోని మహంకాళి ప్రాంతంలో బాబీ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు తన సిబ్బందిని పంపించారు.  ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లగా బాబీ అప్పటికే  దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు గుర్తించారు. వెంటనే పోలీసు సిబ్బంది అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం బాధితుడిని అతడి  కుటుంబసభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి టెక్నాలజీ సాయంతో నిండు ప్రాణాన్ని కాపాడటంలో  చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు, సీఐ క్రాంతి కుమార్ అభినందించారు.
 
ట్యాంక్ బండ్ లోకి దూకిన మహిళ
ఓ మహిళ ట్యాంక్ బండ్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ట్యాంక్ బ్యాండ్ శివ కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ట్యాంక్ బండ్ శివ హుస్సేన్ సాగర్ లోకి దూకి మహిళను బయటకు తీసుకొచ్చారు. ఆమె బతికి ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 
Also Read: హత్యాచారం చేసి, బట్టలు ఉతుక్కుని వెళ్లి హాయిగా నిద్రపోయాడు: కోల్‌కతా డాక్టర్ కేసులో సంచలనం

Also Read: Hyderabad Drugs Case : డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ - లావణ్య, రాజ్ తరణ్ వ్యవహారంతోనూ లింకులు ! 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget