అన్వేషించండి

Hyderabad Drugs Case : డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ - లావణ్య, రాజ్ తరణ్ వ్యవహారంతోనూ లింకులు !

Mastan Sai : మస్తాన్ సాయి అనే డ్రగ్స్ పెడ్లర్‌ను హైదరాబాద్ పోలీసులు గుంటూరులో అరెస్టు చేశారు. కేవలం డ్రగ్స్ కేసుల్లోనే కాకుండా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

Drugs Peddler Mastan Sai  Arrested :   లావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారంలో ఎక్కువగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. లావణ్యకు మస్తాన్ సాయినే డ్రగ్స్ సరఫరా చేసేవాడని..ఆయనతోనే చాలా కాలం సహజీవనం చేసిందని రాజ్ తరుణ్ ఆరోపించారు. అయితే అప్పట్నుంచి ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి కనిపించకుండా పోయారు. పలు డ్రగ్స్ కేసుల్లో ఈ మస్తాన్ సాయి ఉన్నట్లుగా గుర్తించిన హైదరాబాద్ పోలీసులు పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. గుంటూరులోని ఓ దర్గాలో తలదాచుకున్నట్లుగా గుర్తించి..అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు తరలించి విచారణ జరుపుతున్నారు. 

డ్రగ్స్ సరఫరాలో కీలకమైన వ్యక్తి మస్తాన్ సాయి                           

ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మస్తాన్ సాయి అనే వ్యక్తి డ్రగ్స్ బిజినెస్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని గుర్తించారు.  హైదారాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ ,ఇటీవల డిల్లి నుంచి డ్రగ్స్ తెస్తున్న నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిని గుర్తించారు. పోలీసులు మస్తాన్ సాయి ఫోన్‌ను స్వాధీనం  చేసుకుని అందులో వివరాలను పరిశీలిస్తే..  మైండ్ బ్లాంకయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మస్తాన్ సాయి ఫోన్ లో చాలా మంది అమ్మాయి ల ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు గుర్తింంచారు. పలువురు అమ్మాయిలు ప్రయివేటు వీడియోలు చిత్రకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గుర్తించారు. 

పలువురు యువతుల్ని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా అనుమానాలు                  

మస్తాన్ సాయి మొబైల్ లో వీడియోలపై ఆరా తీస్తున్న పోలీసులు .. వారిని ఎలా ట్రాప్ చేశారో తెలుసుకుంటున్నారు. ఏపీ , తెలంగాణా  కి చెందిన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకొని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్లు గుర్తించారు. సినిమా అవకాశాలు .. ఇతర ప్రలోభాలకు గురి చేసి మస్తాన్ సాయి యువతుల్ని వంచిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య కూడా మస్తాన్ సాయి ట్రాప్ లో పడినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ సాయితో కలిసి డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించిన తర్వాతనే లావణ్య దూరమైందని.. డ్రగ్స్ తీసుకోవద్దని ఎన్ని సార్లు చెప్పినా వినలేదని రాజ్ తరుణ్ మీడియా సమావేశంలో చెప్పారు. 

లావణ్యకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా మస్తాన్ సాయేనా ? 

లావణ్య కూడా మస్తాన్ సాయితో పరిచయం ఉందని చెప్పింది కానీ.. అంతకు మించి  పెద్దగా వివరాలు జోలికి వెళ్లలేదు. డ్రగ్స్ వ్యాపారంపై పంజా విసురుతున్న హైదరాబాద్ పోలీసులు.. మస్తాన్ సాయిని అరెస్టు చేస్తే ప్రధానంగా గుట్టు రట్టవుతుందని క్లారిటీ రావడంతో నిఘా పెట్టారు. తన కోసం పోలీసులు వెదుకుతున్నారని తెలిసిన తర్వాత మస్తాన్ సాయి.. ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే డ్రగ్స్ బిజినెస్ మాత్రం మానలేదు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ.. గుంటూరు రైల్వే స్టేషన్ లో దొరికినట్లు దొరికి తప్పించుకున్నాడు. కానీ తర్వాత పోలీసుల నిఘాకు దొరికిపోయాడు. విచారణలో సంచలన విషాయలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Bhadrachalam Water Level: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Devara Part 1 Trailer Reaction | ధైర్యాన్ని చంపేసే భయం..దేవరగా తారక్ ప్రభంజనం | ABP DesamAttack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP DesamVamsadhara Flood Gotta Barrage | భారీ వర్షాలతో వంశధారకు పోటెత్తుతున్న వరద | ABP Desamఅనంత్, రాధికల పెళ్లిలోని వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Bhadrachalam Water Level: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
Palnadu News: పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
Alcazar Vs Carens: అల్కజార్ వర్సెస్ కారెన్స్ - ధర, ఫీచర్స్ పరంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్?
అల్కజార్ వర్సెస్ కారెన్స్ - ధర, ఫీచర్స్ పరంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్?
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Uttarakhand Landslide: కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి - సీఎం సంతాపం
కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి - సీఎం సంతాపం
Embed widget