అన్వేషించండి

Hawala Money: భాగ్యనగరంలో హవాలా డబ్బు, రూ1.24 కోట్లు పట్టుకున్న పోలీసులు!

Hawala Money: హైదరాబాద్ లో 1.24 కోట్ల హవాలా డబ్బును తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. డబ్బును స్వాధనం చేసుకున్నారు. 

Hawala Money: భాగన్యనగరంలో అక్రమంగా తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. మాసబ్ ట్యాంక్ పరిధిలో షోయబ్ అనే వ్యక్తి వద్ద 1.24 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ మీరట్ కు చెందిన షోయబ్ మాలిక్ హైదరాబాద్ వచ్చి పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. బంధువు కామిల్ సూచన మేరకు హవాలా డబ్బు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. గుజరాత్ గల్లీకి చెందిన భరత్ వద్ద తీసుకున్న ఈ డబ్బును షోయబ్ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో షోయబ్ నివాసంలో తనిఖీ చేసిన పోలీసులు.. డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన లెక్క చెప్పకపోవడంతో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. 

మొన్నటికి మొన్న అక్రమంగా గంజాయి తరలింపు..

హైదరాబాద్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 98 కిలోల గంజాయితో పాటు ఏడు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీదర్ కి చెందిన  ప్రకాష్ రాథోడ్ (24) గత  కొంతకాలంగా సంగారెడ్డిలో నివసిస్తున్నాడు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చాట్ బండార్ ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాథోడ్ కు పశ్చిమ గోదావరికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని తెచ్చి మణికొండలో విక్రయించాలని పథకం రచించారు. ఈ క్రమంలో భాగంగానే ప్రకాష్ రాథోడ్, భాను రాథోడ్ మూడవత్ నివార్తి, భీమ్ రావ్ రాథోడ్, రవీంద్ర చావన్ తో కలిసి 2 వాహనాల్లో ఆంధ్రప్రదేశ్ వెళ్లి.. స్పెషల్ క్యాబిన్ ఏర్పాటు చేసిన బొలెరో వాహనం లో 98 కేజీల గంజాయిని తీసుకొని హైదరాబాద్ కు బయలు దేరారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిషా బార్డర్ మీదుగా హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో.. శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు, మోయినాబాద్ పోలీసులు పక్కా సమాచారంతో బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించారు. 

నిందితుల వద్ద నుంచి సుమారు 32 లక్షల విలువ చేసే  98 కేజీల గంజాయితోపాటు ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం మాదాపూర్ పీఎస్ పరిధిలో  కూడా లారీ ముందు భాగం ఏరియాను క్యాబినేట్ ల మార్చి 200 కిలోల గాంజాయిని తరలిస్తుండగా పక్క సమాచారం తో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

జూమ్ కార్ ద్వారా కూడా గంజాయి తరలింపు..

ఇటీవలే జూమ్ కారులో గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విషయాలను బాలానగర్ డీసీపీ సందీప్ వెల్లడించారు. జగద్గిరిగుట్ట పరిధి మహదేవపురంలో హ్యూందాయ్ వెన్యూ కారులో గంజాయి తరలిస్తునారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు కారును తనిఖీలు చేస్తే 104 కేజీల గంజాయి పట్టుబడింది. నలుగురు నిందితులు ఆశిష్ కుమార్(35), కొర్ర రవి(25), కొర్ర శ్రీను(20), నాగేశ్వరరావు(52) లను అరెస్టు చేశారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర యావత్ మాల్ ప్రాంతానికి గంజాయి తరలిస్తుంటారని డీసీపీ తెలిపారు. నిందితులు జూమ్ యాప్ ద్వారా కారు బుక్ చేసుకుని గంజాయి సరఫరా చేస్తుంటారని తెలిపారు. 15 లక్షల విలువైన గంజాయి, కారు, 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి మొత్తం విలువ రూ.35 లక్షల ఉంటుందన్నారు. నిందితులు సరికొత్త వ్యుహంతో జూమ్ యాప్ ద్వారా కార్లను, బైక్ లను బుక్ చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు పోలీసులకు సవాలుగా మారుతున్నారని డీసీపీ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించామని తెలిపారు.  

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget