Hyderabad Crime : డార్క్ వెబ్ డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు, సోనాలి ఫోగట్ హత్య కేసుతో లింక్!
Hyderabad Crime : బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో సంబంధం ఉన్న డ్రగ్స్ పెడ్లర్స్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేసిన నారాయణ బోర్కర్ ను గోవాలో హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు.
Hyderabad Crime : బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. గోవాలో ఓ క్లబ్ లో పార్టీకి హాజరైన ఆమె అనూహ్యంగా మృతి చెందింది. డ్రగ్స్ కలిపిన డ్రింక్ ను బలవంతంగా పట్టించడం వల్లే ఆమె మృతి చెందడానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావించారు. అయితే ఈ డ్రగ్స్ కేసుకు హైదరాబాద్ కు లింక్ ఉందని తాజా అరెస్టులతో తేలింది. ఈ కేసులో హైదరాబాద్ కు లింకులున్న డ్రగ్స్ కేటుగాళ్లును పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. గోవా వెళ్లిన హర్యానా బీజేపీ నేత సోనాలి ఫోగట్ ను నమ్మించిన స్నేహితులు పబ్ కు తీసుకువెళ్లి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి ప్రాణాలు తీశారనే ఆరోపణలు వినిపించడంతో ఆ కేసును సీరియస్ గా తీసుకున్న గోవా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఆ కేసుతో సంబంధం ఉన్న డ్రగ్స్ పెడ్లర్స్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోనాలి ఫోగట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు నారాయణ బోర్కర్ అలియాస్ బాబుతో పాటు మరికొందరు హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. దీంతో సోనాలి ఫోగట్ హత్య కేసులో కీలక నిందితుడు హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లే.
క్రిప్టో కరెన్సీ లో పేమెంట్స్
గోవా, దిల్లీ, బెంగుళూర్ డ్రగ్స్ ముఠాలపై కన్నేసిన హైదారాబాద్ పోలీసులు డార్క్ వెబ్ ద్వారా నడుస్తున్న డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ తో పాటు హైదరాబాద్ కు చెందిన ఆరుగురిని తాజాగా అరెస్ట్ చేశారు. మూడు అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాలను పట్టుకున్నామని, ఈ ముఠా సభ్యులు డార్క్ వెబ్ వాడుతూ, క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్స్ చేస్తున్న వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఈ ముఠాలో ఇద్దరు సభ్యులను అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. డ్రగ్స్ వినియోగిస్తున్న 30 మందిని గుర్తించామని చెప్పారు. రాజకీయ, వ్యాపార, సినిమా రంగాలకు చెందినవారు ఈ వినియోగదారుల లిస్టులో ఉన్నారని స్పష్టం చేశారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.
డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్స్
డ్రగ్స్ వినియోగిస్తున్న వారంతా ఉన్నత చదువులు చదివి, సంపన్నులుగా ఉన్నవారేనని, వారి నుంచి 140 గ్రామ్స్ చరస్, 1450 గ్రామ్స్ గాంజా, 184 బ్లాట్స్ LSD, 10 గ్రామ్స్ MDMA స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వినియోగదారులు వీటిని డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్స్ చేసుకుంటూ.. క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారని స్పష్టంచేశారు. ఈ నెట్ వర్క్ కి లీడర్ నరేంద్ర ఆర్య గోవాలో ఉంటూ నెట్ వర్క్ నడిపిస్తున్నాడని, ఇతనికి దేశవ్యాప్తంగా 4 వేల వినియోగదారులున్నారని అన్నారు. వీరిలో హైదరాబాద్ లో ఐదుగురు వినియోగదారులున్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు. ఆర్డర్ పేమెంట్ చేసిన తర్వాత కొరియర్ ద్వారా డ్రగ్స్ ని పంపిస్తున్న ఈ ముఠాపై కొరియర్ ఏజెన్సీలు కూడా జాగ్రత్తా ఉండాలని సూచించారు. కొరియర్ ఏజెన్సీలు కూడా స్కానర్స్ పెట్టుకొని కొరియర్స్ లో ఏమున్నాయో చూసుకోవాలని సీపీ సూచించారు.
ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ ఘటనతో
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ ఘటన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాలతో డ్రగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామని సీపీ ఆనంద్ తెలిపారు. ఇప్పటికే 58 డ్రగ్ కేసులు పెట్టారని, 285 మందిని అరెస్ట్ చేయించారని తెలిపారు. దీంతో హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మాలంటే భయం ఏర్పడిందని, డ్రగ్స్ కావాలనుకునేవారు గోవా, బెంగుళూరు లాంటి నగరాలకు వెళ్లి డ్రగ్స్ తెచ్చుకుంటున్నారని, ఇలా ఇక్కడి వారికి డ్రగ్స్ అమ్మే ఇతర రాష్ట్రాల వారిని కూడా అరెస్టు చేస్తామని సీపీ హెచ్చరించారు.
కొరియర్ లో డ్రగ్స్
''హైదరాబాద్ పోలీసులు గోవాకి వచ్చి డ్రగ్ పెడలర్స్ ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. కానీ సోనాలి ఫోగట్ మృతిపై గోవా పోలీసులు, సీఎం మాత్రం ఈ విషయం తెలియదన్నట్లు ఉంటున్నారు'' అని అక్కడి లోకల్ పేపర్స్ ప్రశంసించిన విషయాన్ని సీపీ గుర్తుచేశారు. తాము అదుపులోకి తీసుకున్న వారిలో సోనాలి ఫోగట్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రితీష్ నారాయణ్ బోర్కర్ అండ్ గ్యాంగ్ ఉన్నట్లు తెలిపారు. పెడ్లర్స్ మామూలు కొరియర్స్ లాగా డ్రగ్స్ ని కొరియర్స్ లో పంపుతున్నారని, నెల రోజుల్లో 600 మంది డ్రగ్ యూజర్స్ ని గుర్తించామని తెలిపారు. ఎక్కువగా స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులే ఉన్నారు సీపీ వెల్లడించారు. 231 డ్రగ్స్ వినియోగదారులకు రిహాబిలిటేషన్ సెంటర్స్ లో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై దృష్టి ఉంచాలని.. వారు ఏం చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని సీపీ సూచించారు.
Also Read : Finger Print Surgery Scam : హైదరాబాద్ లో కొత్త దందా, గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఫింగర్ ప్రింట్ సర్జరీలు!