అన్వేషించండి

Finger Print Surgery Scam : హైదరాబాద్ లో కొత్త దందా, గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఫింగర్ ప్రింట్ సర్జరీలు!

Finger Print Surgery Scam : హైదరాబాద్ లో కొత్త దందా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఫింగర్ ప్రింట్స్ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Finger Print Surgery Scam :  ఇటీవల వచ్చిన ఓ సినిమాలో మృతదేహాల ఫింగర్ ప్రింట్స్ క్రిమినల్ గ్యాంగ్స్ అమ్ముతుంటారు. అయితే భాగ్యనగరంలో ఇలాంటి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఫింగర్ ప్రింట్స్ సర్జరీ చేస్తున్నారు. ఈ ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ఫింగర్ ప్రింట్స్ ముఠా ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే వేలిముద్రలు పడడం తప్పనిసరి. ఫింగర్ ప్రింట్ ఒక్కసారి రిజక్ట్ అయితే ఆ దేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ ఉండదు. అయితే ఇలా వేలిముద్రలు రిజెక్ట్ అయిన యువకులు సర్జరీలు చేయించుకుని మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా సర్జరీ చేయించుకున్న వేలిముద్రలు సంవత్సరం పాటు ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్జరీ చేయించుకుని దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యువకులకు ఫింగర్ ప్రింట్స్ సర్జరీ చేస్తున్న వైద్యుడితో పాటు కొంత మంది సిబ్బందిని పోలీసులు అరెస్టుచేశారు. 

సర్జరీలతో ఫింగర్ ప్రింట్స్ మార్పు

హైదరాబాద్ నగరంలో వేలిముద్రలతో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలకు పంపేందుకు శస్త్ర చికిత్స ద్వారా యువకుల వేలిముద్రలు మార్చేస్తున్న ముఠా గుట్టురట్టుచేశారు రాచకొండ పోలీసులు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక వైద్యుడు సహా,  కొద్ది మందిని పోలీసులు అరెస్టు చేశారు. యువతను గల్ఫ్‌కు పంపడంలో ఏజెంట్ల పాత్ర, ఎంత మంది ఆ విధంగా రాష్ట్రం విడిచివెళ్లారు అనే విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతకుముందు పాలిమర్‌ను ఉపయోగించి వేలిముద్రలను క్లోనింగ్ చేసే ముఠాను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. అయితే సర్జరీ చేసి వేలిముద్రలను మార్చే గ్యాంగ్ పోలీసులకు షాక్ ఇచ్చింది. 

Finger Print Surgery Scam : హైదరాబాద్ లో కొత్త దందా, గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఫింగర్ ప్రింట్ సర్జరీలు!

గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు  

ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు తప్పనిసరిగా వేలిముద్రలు తీసుకోవాలి. వాటిని రిజెక్ట్ చేస్తే అక్కడికి వెళ్లే అవకాశం కోల్పోతారు. అయినప్పటికీ ప్రజలు విదేశాలకు వెళ్లేందుకు వివిధ మార్గాలను వెతకడానికి ప్రయత్నిస్తారు. దీన్ని క్యాష్ చేసుకోడానికి ఓ ముఠా సహజమైన వేలిముద్రను శస్త్రచికిత్సా విధానం ద్వారా కవర్ చేయడానికి ప్రయత్నించింది. ఈ ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ఒక సంవత్సరం పాటు ఉంటాయని, వాటి ద్వారా విదేశాలకు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ఫింగర్ ప్రింట్స్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. A1 నాగమహేశ్వర్ రెడ్డి, A2 వెంకటరమణ, A3 శివ శంకర్ రెడ్డి, A4 రామకృష్ణారెడ్డి అనే నలుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. 

సింథటిక్ ఫింగర్ ప్రింట్ స్కామ్ 

జులైలో ఇలాంటి మోసం ఒకటి వెలుగుచూసింది. జీహెచ్ఎంసీలో సింథటిక్ ఫింగర్ ప్రింట్ స్కామ్ జరిగింది. గోషామహల్, మలక్పేట సర్కిళ్ల పరిధిలో చోటుచేసుకున్న ఈ స్కామ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకట్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టుచేశారు.  ఫెవికాల్, ఎంసీల్ మిక్స్ చేసి  కృత్రిమ వేలిముద్రలు తయారు చేసినట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ లో చూసి ఆర్టిఫిషియల్ వేలిముద్రలు తయారుచేశారని తెలిపారు. ఫెవికాల్ లో ఎంసీల్ మిక్స్ చేసి సింథటిక్ లాంటి పదార్థాన్ని ఫీల్డ్ లోకి తీసుకువెళ్లి జీహెచ్ఎంసీలో పంచ్ చేశారని పోలీసులు గుర్తించారు.  

Also Read : Dumka Killing: దుంకా కిల్లింగ్ కేసులో నిందితుడిపై పోక్సో కేసు, విచారణ వేగవంతం అవ్వాలని సీఎం ఆదేశాలు

Also Read : కానిస్టేబుల్ ప్రకాశ్‌ కేసులో ట్విస్ట్ - ఎస్పీ సహా నలుగురిపై విచారణకు ఆదేశం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget