Teacher Fake Certificates : ఈ టీచర్ మామూలోడు కాదు , చదువు చెప్పి కాదు నేరుగా ప్రింట్ కొట్టి డిగ్రీలిచ్చేస్తున్నాడు !
ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముకుంటున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ టీచర్ ఈ ముఠాకు నాయకుడు.
Teacher Fake Certificates : టీచర్ అంటే చదువులు చెప్పి విద్యార్థులకు డిగ్రీలు వచ్చేలా చేస్తారు. కానీ ఈ టీచర్ మాత్రం తెలివి మీరిపోయాడు. చదువు చెప్పడం.. వాళ్లు నేర్చుకోవడం.. మళ్లీ పరీక్షలు రాయడం.. ఇదంతా తలనొప్పి వ్యవహారం అనుకున్నాడు. తన దగ్గర చదువుకుంటాను అని వస్తే చాలు ఇచ్చినన్ని డబ్బులు తీసుకుని కావాల్సిన డిగ్రీ ప్రింట్ కొట్టి ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు బయటపడకతప్పదు కాబట్టి.. ఇప్పుడు దొరికిపోయాడు.
టీచర్‌గా వచ్చే సంపాదన సరిపోవడం లేదని నకిలీ సర్టిఫికెట్ల దందా వైపు చూపు
విజయ వాడకు చెందిన కోట కిషోర్ కుమార్ ఓ టీచర్ . అడ్డదోవలో డబ్బులు ఎలా సంపాదించాలా అని బాగా పరిశోధన చేసి చివరికి తన వృత్తికి దగ్గరగా ఉండేలా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అమ్ముకోవాలనుకున్నాడు. నకిలీ సర్టిఫికెట్లు కు డిమాండ్ ఉందని భావించి రంగంలోకి దిగాడు. ఏ క్యాంపస్ అనే పేరుతో ఓ ఇనిస్టిట్యూట్ ప్రారంభించాడు. అక్కడ కి వచ్చే విద్యార్థులకు వన్ టైం సిట్టింగ్ ద్వారా సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా ఆఫర్ చేసేవాడు . వారికి సర్టిఫికెట్లు కూడా ఫేక్‌వే ఇవ్వాలని నిర్ణయించుకుని.. గూగుల్ లో సెర్చ్ చేసాడు . ఇతనికి పరిచయమైన బొక్క వెంకటేశ్వర్ రావు , కిరణ్ కుమార్ , కృష్ణ కాంత్ రెడ్డి ఇలా 14 మందితో కలిసి అచ్చంగా నిజం అనిపించేలా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేయడం ప్రారంభించారు.
18 యూనివర్శిటీల పేర్లతో నకిలీ స్టాంపులు తయారీ
ఇలా తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లు ను వారి వారి అడ్రెస్ లకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంటర్ , SSC మార్క్స్ మెమో లను పోస్ట్ ద్వారా పంపేవారు. . కొద్ది రోజులు క్రితమే బీహార్ లో ఉన్న ఆ రాహుల్ గోష్ అనే వ్యక్తికి బీఫార్మసీ సర్టిఫికెట్లు ను పోస్ట్ ద్వారా పంపించింది ముఠా .. తమిళనాడు , బీహార్ , కేరళ ,జార్ఖండ్ , ఒడిశా , ఛతీస్ ఘాట్ కు చెందిన ఇంటర్ , SSS సర్టిఫికెట్లు అమ్మకాలు చేసినట్లు విచారణలో తేలింది . ఈ ముఠా మొత్తం సర్టిఫికెట్లు రెడీ చేసి టీచర్ కొట కిషోర్ కుమార్ కి పంపితే అతని వాటికి కావాల్సిన రబ్బర్ సీల్ , సపోర్ట్ డాక్యుమెంట్లు ను సమకూర్చి ఇచ్చేవాడు.
వందల ఫేక్ సర్టిఫికెట్లు అమ్మినట్లుగా అనుమానాలు
ఇప్పటి వరకు 18 యూనివర్సిటీలకు చెందిన నకిలీ పత్రాలు తో పాటు 13 రాష్ట్రాలకు చెందిన ఇంటర్ , SSC మార్క్స్ మెమోలు తయారు చేసి విక్రయించినట్లు తేలింది.. వీరు డిగ్రీ సర్టిఫికెట్లు కు 60 వేలు , బీ టెక్ 2. 5 లక్షలు , ఒక్కో యూనివర్సిటీ సర్టిఫికెట్లు కు 90 వేలు రూపాయలు చప్పున అమ్మకాలు చేసినట్లు గుర్తించారు . ఈ నకిలీ పత్రాలు ద్వారా ప్రభుత్వ , ప్రయివేటు ఉద్యోగాల్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు . అడ్డదారుల్లో పొందిన పత్రాలు ఆధారంగా ఉన్నత చదువులు కోసం అబ్రాడ్ పోయారని పోలీసులు గుర్తించారు .. ఇప్పటికే ఈ ముఠా నుండి 100 మందికి పైగా ఫేక్ సర్టిఫికెట్స్ పొందారని తేలింది .. నిందితుల నుంచి 70 ఫేక్ సర్టిఫికేట్స్,4 ఫేక్ స్టాంప్స్,CPU లు,బ్యాంక్ కార్డ్స్ ,ఆధార్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు . వీరిని కస్టడీకి తీసుకుంటే మరి కొన్ని విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు భావిస్తున్నారు ..