News
News
X

Hyderabad Crime : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం, ఎంఐఎం కార్పొరేటర్ మేనల్లుడిపై కత్తులతో దాడి!

Hyderabad Crime : హైదరాబాద్ లో ఎంఐఎం కార్పొరేటర్ ఆఫీస్ లో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు దుండగులు. తీవ్ర గాయాలపాలైన యువకుడు మృతి చెందాడు.

FOLLOW US: 
Share:

Hyderabad Crime : హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. ఎంఐఎం కార్పొరేటర్ మేనల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. లలితా బాగ్ కార్పొరేటర్ మేనల్లుడ్ని దుండగులు హత్య చేశారు. ఎంఐఎం కార్పొరేటర్ కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు ఓ వ్యక్తిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఏఐఎంఐఎం లలితా బాగ్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కార్యాలయంలో ఓ వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. హైదరాబాద్ భవానీ నగర్ పీఎస్ పరిధిలోని లలితా బాగ్ మోయిన్ బాగ్ లో గుర్తుతెలియని వ్యక్తులు కార్పొరేటర్ ఆజం షరీఫ్ కార్యాలయంలోకి కత్తులతో ప్రవేశించి ఒక వ్యక్తిపై దాడి చేశారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది.  

ఎంఐఎం కార్పొరేటర్ ఆఫీస్ లోనే దాడి

లలితాబాగ్ ఎంఐఎం కార్పొరేటర్ ఆఫీస్‌లో దారుణ హత్య జరిగింది. కత్తులతో కార్పొరేటర్ ఆఫీస్ లోకి వచ్చిన దుండగులు కార్పొరేటర్ మేనల్లుడు ముర్తజాపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడికి దిగడంతో కార్పొరేటర్ మేనల్లుడు ముర్తజా తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముర్తజాను కార్పొరేటర్ అనుచరులు ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన అనస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. హత్య గురించి తెలుసుకున్న ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ దాడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ తో దర్యాప్తు మొదలుపెట్టారు. భూవివాదంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

మంచిర్యాల సజీవ దహనం కేసులో కీలక ఆధారాలు 

మంచిర్యాల జిల్లా గుడిపెల్లి(వెంకటాపూర్)లో ఆరుగురు సజీవ దహనం అయిన కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సీసీసీ పెట్రోల్ బంక్ లో ముగ్గురు వ్యక్తులు ఐదు వేల రూపాయల పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు. లక్షెట్టిపేటకు చెందిన వ్యక్తి, ఉట్కూర్ కు చెందిన మరో వ్యక్తితోపాటు గోదావరిఖనిలో ఐదుగురు, ఆటోలో ఉన్న ఇద్దరు, గుడిపెల్లికి చెందిన వ్యక్తి మొత్తం పది మందిని మరిన్ని వివరాల కోసం విచారణ చేస్తున్నారు. లక్షెట్టిపేట, ఉట్కూర్ కు చెందిన ఇద్దరు మంచిర్యాలలోని ఓ లాడ్జిలో వారం రోజుల నుంచి ఉంటున్నారు. వారు పలుమార్లు రెక్కీ నిర్వహించిన అనంతరం ఈనెల 16వ తేదీన శ్రీరాంపూర్ కు చెందిన ఆటో మాట్లాడుకొని అప్పటికే సిద్ధం చేసుకున్న డబ్బాల్లో సీసీసీ బంక్ లో రాత్రి 9.54 గంటలకు పెట్రోల్ తీసుకున్నారు. 

పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయిన దుండగులు

గుడిపెల్లికి చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దగ్గరి దారిలో కాకుండా రసూల్ పెల్లి మీదుగా గుడిపెల్లికి 15 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించారు. మార్గ మధ్యలో మద్యం తాగిన వీరు రాత్రి 11.15 గంటలకు గుడిపెల్లి శివారుకు చేరుకున్నారు. 11.45 గంటల నుంచి 12.15 గంటల వరకు బాధితుల ఇంటికి ఉన్న రెండు తలుపుల నుంచి లోపల పెట్రోల్ గుమ్మరించారు. మంటలు రేగాక చుట్టు పక్కల వారు మేల్కొనడంతో పెట్రోల్ డబ్బాలను చింతచెట్టు కింద వదిలి వచ్చిన ఆటోలోనే పరారు అయ్యారు. అనంతరం లాడ్జికి చేరుకొని 17వ తేదీన అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉట్కూర్ కు చెందిన వ్యక్తిపై ఇంతకు ముందే హత్య కేసు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి తల్లికి, మంటల్లో కాలిపోయిన వ్యక్తి తమ్ముడికి అక్రమ సంబంధం ఉండటంతో 15 సంవత్సరాల క్రితం ఆయనను హతమార్చినట్లు విచారణలో వెలుగు చూసింది. 

Published at : 19 Dec 2022 06:26 PM (IST) Tags: Hyderabad murder Crime News MIM Corporator TS News

సంబంధిత కథనాలు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

CI Dies Of Heart Attack: ఏపీలో మరో విషాదం - విధి నిర్వహణలో గుండెపోటుతో సీఐ మృతి

CI Dies Of Heart Attack: ఏపీలో మరో విషాదం - విధి నిర్వహణలో గుండెపోటుతో సీఐ మృతి

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌