అన్వేషించండి

Hyderabad Minor girl Case : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు, సంచలన ఆధారాలు బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన్

Hyderabad Minor girl Case : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు సీరియస్ గా విచారణ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొడుకు కారులో ఉన్నట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.

Hyderabad Minor girl Case : పోలీసులు బీజేపీ నేతలను భయపెట్టడం కాదు తప్పు చేసిన వాళ్లను భయపెట్టాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందర్ రావు అన్నారు. హైదరాబాద్ లో మాట్లాడిన ఆయన పోలీసులు బాలిక అత్యాచారం కేసు సీరియస్ గా విచారణ చేయాలన్నారు. ఆయన మాటల్లోనే... "అక్కడ ఓ పోలీస్ ఆఫీసర్ అంటారు మీ మీడియా బ్రేకింగ్ ల కోసం, టీఆర్పీల కోసం మేం మాట్లాడాం అని. నిన్న ప్రెస్ మీట్ పెట్టే వరకు, కేటీఆర్ ట్విట్టర్లో స్పందించే వరకు మీ విచారణ ఏదీ, సీసీ టీవీ ఫుటేజ్ ఏదీ. ఆధారాలు తుడిపేయకండి సర్. తప్పు చేసే వారిని శిక్షించండి సర్ అని కోరుతున్నాం. మేము ఆందోళన చేసేందుకు వెళ్తే యువరాజు ట్విట్టర్లో సందిస్తారు ఏం విచారణ చేశారో తెలియదు రాత్రికి రాత్రి అరెస్టులు అయినవి అని చెబుతారు. ఎవరు అరెస్ట్ అయ్యారో చెప్పమంటే నిందితులు మైనర్లు వాళ్ల ఫొటోలు చూపించకూడదంటారు. దిల్లీలో నిర్భయ కేసు అయినప్పుడు మైనర్ల పేర్లు, ఫొటోలు మీడియా ప్రచురించింది. పోలీసులు ఇప్పుడు వాళ్లు పెద్ద కుటుంబాల వోళ్లు అని, అధికార పార్టీకి చెందిన వారని అంటున్నారు. నేను రెండు చేతులూ జోడించి వేడుకుంటున్న నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. నిర్భయంగా నిందితులను అరెస్టు చేయండి. బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం." అని రఘునందర్ రావు అన్నారు. 

ఐపీఎస్ ఆఫీసర్లు తీర్పు ఇచ్చేస్తారా? 

'పోలీసులు మీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టండని అంటున్నారు. పోలీసులు ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే కొడుకు, హోంమంత్రి మనవడు లేదంటా క్లీన్ చీట్ ఎలా ఇచ్చేస్తారు? అందుకు కోర్టు ఉంది కాదా. ఆరోపణ వచ్చినప్పుడు విచారణ చేయాలి. సీసీ టీవీ ఫుటేజీ పై అనుమానాలు ఉన్నప్పుడు ప్రజల ముందు ఉంచాలి. కానీ ఓ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి అంతా అయిపోయింది వీళ్లే నిందితులు అని చెప్పడం సరికాదు. ఆ నిందితులు కూడా మైనర్లు అని వాళ్ల ఫొటోస్ బయటపెట్టడంలేదు. ఐపీఎస్ ఆఫీసర్ తీర్పులు ఇచ్చేస్తారా. మనం చైనాలో లేంకాదు కదా. భారతదేశంలో ఉన్నాం. బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం అమల్లో ఉంది.  నేరం జరిగినప్పుడు నిందితులను అరెస్టు చేశారా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు లీక్ లు ఇస్తున్నారు కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లు ఆధారాలు లేవు. కేటీఆర్ స్పందించిన తర్వాత పోలీసులు స్పందిస్తారు. భాగ్యనగరంలో పోలీసింగ్ వ్యవస్థ కేసీఆర్, కేటీఆర్ ఆధీనంలో లేదు. రజకార్ల ఆధీనంలో ఉంది. వాళ్లు చెప్పినట్లే కేసు విచారణ జరుగుతోంది. వాళ్లు చెప్పిన వారినే అరెస్టు చేస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు జరుగుతున్నాయి.' అని రఘునందర్ రావు ఆరోపించారు. 

హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ తో విచారణకు డిమాండ్ 

'బాధిత బాలిక వివరాలు బయటపెట్టకూడదు. అది నాకు తెలుసు. పోలీసులు మీడియాను బెదిరిస్తున్నారు. వార్తలు ఎలా రాస్తావని బెదిరిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ గారు సిద్ధిపేటలో, భాగ్యనగరంలో ఎలా విచారణ చేస్తారో తెలుసు. మరోసారి పోలీసులు సీరియస్ గా విచారణ చేయాలి. నేను ఆరోపణ చేసినట్లు రెడ్ కలర్ మెర్సిడెస్ బెంచ్ లో ఎమ్మెల్యే కొడుకు అత్యాచారానికి పాల్పడుతున్న ఫోటోలు ఇవి. పోలీసులు ఏ ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు కారులో లేరని చెబుతున్నారో వాళ్ల ఫొటోస్ ఇవి. అమ్మాయిపై అఘాయిత్యం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోస్ , వీడియోలు డీజీపీ మహేందర్ రెడ్డికి కూడా పంపిస్తాం. ఈ ఆధారాలు మేం బయటపెట్టాలా. పోలీసులు బయటపెట్టాలా తెలుస్తోంది లేదా కోర్టుకు సమర్పించాలో తెలుస్తోంది. ఆధారాలు ఉన్నా ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారులో నలుగురు ఉన్నారు. ఇవన్నీ చూసిన కూడా ఎమ్మెల్యే కొడుకు పాత్ర లేదని పోలీసులు వాదిస్తే వారికి కూడా వీడియోలు పంపిస్తాం. పోలీసులు విచారణ సరిగ్గా చేయకపోతే సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు సీజేను విజ్ఞప్తి చేస్తున్నారు హైకోర్టు సిటింగ్ జడ్జ్ తో విచారణ చేయాలని కోరుతున్నాం.' అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget