By: ABP Desam | Updated at : 27 Feb 2023 05:42 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
డా.మజారుద్దీన్ ఆత్మహత్య
Hyderabad News : హైదరాబాద్ లో గన్ ఫైర్ కలకలం రేపుతోంది. గన్ తో కాల్చుకోని డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడ్ని జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు. కుటుంబ తగాదాల కారణంగా వైద్యుడు మజార్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లో తన ఇంట్లో మజార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన మజార్ ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మజార్ చనిపోయాడు. మృతుడు మజార్ అలీ ఖాన్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సమీప బంధువు అని సమచారం.
అసలేం జరిగింది?
బంజారాహిల్స్‌లో మజారుద్దీన్ అనే వైద్యుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని తన నివాసంలో గన్‌తో కాల్చుకుని తీవ్ర గాయాలు కాగా వెంటనే కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 64 సంవత్సరాల వయసున్న మజారుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందాడు. కుటుంబ తగాదాల కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు మజారుద్దీన్ అలీ ఖాన్ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సమీప బంధువు. అసదుద్దీన్ ఓవైసీ రెండో కూతురు అఫియా వివాహం సెప్టెంబర్22, 2020లో మజార్ కుమారుడు అబిల్ అలీ ఖాన్‌తో జరిగింది. ఓవైసీ ఆస్పత్రి ఏర్పాటు చేసినప్పటి నుంచి అందులో ఆర్థోపెడిక్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు మజారుద్దీన్. ఓవైసీ కుటుంబంతో మజారుద్దీన్ అలీఖాన్ కుటుంబం మధ్య మూడు దశాబ్దాలుగా ఉన్న స్నేహం ఇటీవల బంధుత్వంగా మారింది. ఘటనా స్థలానికి పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ చేరుకుని పరిశీలించారు. ప్రస్తుతం అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డీఈఈ వేధిస్తున్నారని లోకో పైలెట్ ఆత్మహత్యాయత్నం
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వే స్టేషన్లో లోకో పైలట్లు, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కృష్ణ అనే లోకో పైలట్ రైల్వే ట్రాక్ మీద వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. అతడిని సహచర ఉద్యోగులు కాపాడారు. డీఈఈ శ్రీనివాస్ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారంటూ లోకో పైలట్లు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. డీఈఈపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు లోకో పైలట్లు తెలిపారు. రాజమండ్రి డిపో అనగానే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని, ప్రశాంతంగా పనిచేసుకునే పరిస్థితి ఇక్కడ లేదని ఆరోపిస్తున్నారు. వారానికో పీఆర్ ఇవ్వాల్సిందేనని, ఈస్ట్ కోస్ట్, సదరన్ రైల్వే, గుంటూరు డివిజన్ ఇలా ఎక్కడా లేని రైల్వే బోర్డు ఆర్డర్లు కేవలం రాజమండ్రి డిపోకే ఉండడమేమిటని, ఇది దురదృష్టకరం లోకో పైలెట్లు మండిపడ్డారు. లోకో రన్నింగ్ యూనిట్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
కలెక్టరేట్ బిల్డింగ్ పైకెక్కి భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం
కాకినాడలోని కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి దుర్గా దేవి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తమ స్థలం, ఇల్లు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన చెందింది. తమను చంపాలని చూస్తున్నారని మహిళ భర్త రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసి కిందకు దించారు.
పోలీస్ స్టేషన్ లో గొంతుకోసుకున్న యువకుడు
కాకినాడ టూటౌన్ పోలీస్టేషన్ లో మణికంఠ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. హిజ్రాపై బీరు బాటిల్ తో దాడి చేసినట్టు వచ్చిన ఫిర్యాదుతో మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అరెస్టుతో మనస్థాపానికి గురైన యువకుడు స్టేషన్ లో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. యువకుడికి తీవ్ర రక్తం స్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. శవివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి చికిత్స చేయించి యువకుడిని ఇంటికి పంపించారు.
హెడ్ కానిస్టేబుల్ సూసైడ్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నరసింహ స్వామి అక్కడే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ కు కారణం తెలియాల్సి ఉంది.
Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!
Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా?
Eluru Crime: పండుగపూటే విషాదం - ఆటోపై విరిగిపడిన తాటిచెట్టు, రెండేళ్ల పాప దుర్మరణం
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు
Gold Seized in Vijayawada: విజయవాడలో రూ.7.48 కోట్ల బంగారం పట్టివేత - బస్సులో, రైళ్లో తరలిస్తుండగా నిందితుల అరెస్ట్!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల