Hyderabad: హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కిరాతక హత్య! పట్టపగలే ముగ్గురు వ్యక్తులు దారుణం
హత్యకు గురైన వ్యక్తితో పాటు ముగ్గురు నిందితులను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ రోడ్డుపైన అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా కత్తితో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
పట్ట పగలు నడిరోడ్డుపై వాహనదారులు చూస్తుండగానే యువకుడిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర గాయాలకు గురైన సదరు యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు. ఘటన తర్వాత ముగ్గురు నిందితులు అక్కడి నుంచి తలోదిక్కుకీ పరారయ్యారు. అయితే, హత్యకు గురైన యువకుడి వివరాలు, హత్యకు గల కారణాలు ఏమీ తెలియరాలేదు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో న్యూ జియాగూడలోని పురాణాపూల్ వెళ్లే రోడ్డుపై ఈ ఘటన జరిగింది.
యువకుడిని ముగ్గురు వ్యక్తులు కత్తులతో వెంబడించారు. యువకుడు పారిపోతూ పడిపోవడంతో ఆ తర్వాత ముగ్గురు విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే, రోడ్డు వెంట వెళ్తున్న వారంతా చూస్తూ ఉన్నారు కానీ, ప్రాణభయంతో ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మరికొందరు సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. మృతుడు ఎవరు అనే వివరాలు తెలుసుకునేందుకు అతని వస్తువులను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. మృతుడు ఎవరు? హత్య చేసింది ఎవరు? కారణాలు ఏంటే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హత్యకు గురైన వ్యక్తితో పాటు ముగ్గురు నిందితులను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.