By: ABP Desam | Updated at : 10 Sep 2021 04:23 PM (IST)
Edited By: Venkateshk
Saidabad Girl Rape Murder case
హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో కొద్ది రోజుల క్రితం మాయమై అత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక విషయంలో న్యాయం చేయాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. నిందితుడికి తక్షణం శిక్ష పడేలా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక, బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనించదగ్గ విషయం. ఈ డిమాండ్లతో వారు సాగర్ రోడ్డుపై కూర్చొని ప్లకార్డులు పట్టుకుంటూ, బాలిక ఫోటోలు చేతబట్టి నిరసనలు చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ వెళ్లేందుకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. చివరకు ట్రాఫిక్‌ను మళ్లించాల్సి వచ్చింది.
కలెక్టర్ హామీ
బాధితులు నిరసన కొనసాగించడంతో ఆ ప్రాంతానికి హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ రావాల్సి వచ్చింది. బాధితులతో ఆయన మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. నెల రోజుల్లో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. బాధితుల కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల చెక్కును అందజేశారు. అంతేకాక, డబుల్ బెడ్ రూం ఇల్లు, ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య, కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ పరిధిలో అయ్యే ప్రతి వెసులుబాటు అమలయ్యేలా చేస్తానని శర్మన్ నచ్చజెప్పారు.
మంత్రి సత్యవతి సీరియస్
బాలికపై అత్యాచార ఘటనపై రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్‌కు ఫోన్ చేశారు. దీంతో తక్షణ సాయం కింద రూ.50 వేలు అందించాలని అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఆ మేరకు కలెక్టర్ వారికి రూ.50 వేల చెక్కు అందించారు. అత్యాచారం, హత్య చేసిన నిందితుడు పల్లంకొండ రాజుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. కాబట్టి కాలనీవాసులు సంయమనంతో ఉండాలని సూచించారు.
డీసీపీ రమేష మాట్లాడుతూ.. ‘‘ఈ హత్యాచార కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగవంతం చేసేలా చొరవ తీసుకుంటామని చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. బాధితుల నిరసనలో పోలీసులకు గాయాలు అయ్యాయని అన్నారు. చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సాగర్‌రోడ్డుపై పూర్తిగా రాకపోకలు బంద్ చేసినట్లు చెప్పారు. ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా భారీగా పోలీసులను మోహరించినట్లుగా డీసీపీ తెలిపారు.
Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు
Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు
Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి
Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు
Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్
Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?