Hyderabad: జాబ్ కోసం ఆన్‌లైన్‌లో రెస్యూమ్ పెట్టిన ఎయిర్ హోస్టెస్.. రెండేళ్లకు ఫోన్, 8 లక్షలు హుష్‌కాకీ!
ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న హైదర్ గూడకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం తన రెస్యూమ్‌ను గత రెండు సంవత్సరాల క్రితం ‘షైన్ డాట్ కామ్’ అనే అన్ లైన్ ఉద్యోగాల వేదికలో అప్ లోడ్ చేసింది.
ఉద్యోగాల పేరుతో ఫేక్ ఇంటర్వ్యూలు పెట్టి, బాధితుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్న ముఠాను పోలీసులు ఆటకట్టించారు. వీరు ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుండడంతో ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి మోసపోయింది. ఈ వివరాలను సీసీఎస్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి సీసీఎస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
ఎయిర్ టికెటింగ్ పేరుతో రూ.8 లక్షలు స్వాహా..
ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న హైదర్ గూడకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం తన రెస్యూమ్‌ను గత రెండు సంవత్సరాల క్రితం ‘షైన్ డాట్ కామ్’ అనే అన్ లైన్ ఉద్యోగాల వేదికలో అప్ లోడ్ చేసింది. ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి ఇండిగో ఎయిర్ లైన్స్‌లో ఎయిర్ టికెటింగ్ స్టాఫ్‌గా ఎంపిక అయ్యారని నమ్మబలికాడు. అలా అన్ని ధ్రువ పత్రాలు, ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీల కింద కొన్ని డబ్బులు చెల్లించాలని చెప్పి నమ్మించాడు. విడతల వారీగా యువతి దుండగులకు ఏకంగా రూ.8 లక్షలకు పైగా చెల్లించింది. అంతటితో ఆగని దుండగులు ఇంకా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో అప్పుడు యువతికి అనుమానం వచ్చింది. వెంటనే వారికి ఫోన్ చేసి గట్టిగా నిలదీసింది. ఆ వెంటనే నిందితులు తమ ఫోన్‌లను స్విచాఫ్ చేసేశారు.
వెంటనే యువతి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించుకొని ఢిల్లీకి వెళ్లిన పోలీసులు అక్కడి మయూర్ విహార్ ప్రాంతంలోని కాల్ సెంటర్‌పై దాడి చేశారు. రాజేష్ సింగ్ అలియాస్ చందన్, అనుభవ్ సింగ్, నఫీజ్, షేఫాలీ అలియాస్ నెహా సింగ్, యోగితా అలియాస్ పూజా కుమారి, షాలూకుమారి అలియాస్ రాధికారాజ్, ప్రియా అలియాస్ నిషాకుమారి, శివాని అలియాస్ నదిని అగర్వా సహా మొత్తం 8 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి జైలులోకి పంపారు. వారి నుంచి 26 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, మొబైల్ డాంగిల్ స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Karimnagar: పెద్దోళ్లను ఎదిరించి లవర్‌ను దక్కించుకున్న ప్రియుడు.. యువతి కోరిక నచ్చక ఘాతుకం
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!